Health

నిమ్స్‌లో కోబాస్-TNI కోవిద్ బులెటిన్

నిమ్స్‌లో కోబాస్-TNI కోవిద్ బులెటిన్

* భారత్‌లో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు.తాజాగా నిన్న ఒక్కరోజే రికార్డుస్థాయిలో 14లక్షల 92వేల పరీక్షలు చేపట్టారు.ఒక్కరోజు వ్యవధిలో ఇన్ని టెస్టులు నిర్వహించడం ఇదే తొలిసారి. అయితే, నిన్న చేసిన పరీక్షల్లో 86,052 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి.దీంతో శుక్రవారం నాటికి దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 58,18,570కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.వీరిలో గడిచిన 24గంటల్లో 81వేల మంది కరోనా రోగులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారిసంఖ్య 47లక్షల 56వేలకు చేరింది.మరో 9లక్షల 70వేల క్రియాశీల కేసులు ఉన్నాయి.ఇక రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ, కరోనా సోకి మరణిస్తున్న వారిసంఖ్య క్రమంగా పెరుగుతోంది.నిత్యం దాదాపు 1100మందికిపైగా ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న మరో 1141 మంది కరోనా రోగులు మరణించినట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారిసంఖ్య 92,290కు చేరింది.అయితే, ఈ వైరస్‌ సోకి ప్రాణాలు కోల్పోతున్న వారిలో దాదాపు 70శాతానికిపైగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారేనని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేస్తోంది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 81శాతం దాటగా, మరణాల రేటు 1.59శాతంగా ఉంది.

* ఏపీలో కరోనా కేసుల తీవ్రత మళ్లీ కాస్త తగ్గుముఖం పట్టింది. 24 గంటల వ్యవధిలో 69,429 నమూనాలను పరీక్షించగా 7,073 మందికి కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,61,458కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 8,695 మంది కోలుకోగా.. 48 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో 8 మంది, ప్రకాశం 8, అనంతపురం 6, కృష్ణా 5, పశ్చిమగోదావరి 5, కడప 3, నెల్లూరు 3, విశాఖపట్నం 3, తూర్పుగోదావరి 2, గుంటూరు 2, కర్నూలు 2, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 5,606కి చేరింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 54,47,796 నమూనాలను పరీక్షించినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు.

* ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కారణంగా పాఠశాలలన్నీ మూతపడ్డాయి. కానీ, ఉత్తరాఖండ్‌లో చంపావత్ జిల్లాలోని బారాకోట్ గ్రామంలో మాత్రం మూడు సంవత్సరాల క్రితం మూతపడిన పాఠశాల ఇప్పుడు తెరుచుకోనుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. కరోనా వైరస్‌ కారణంగా నగరాల్లో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు సొంత గ్రామాలకు చేరుకున్నారు. అలాగే బారాకోట్ దాని చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు కూడా నగరాల నుంచి సొంతూళ్లకు చేరుకున్నారు. అయితే తమకు ఉపాధి పోయినా, పిల్లలకు చదువు కావాలనుకున్నారు. అందుకే విద్యార్థులు లేక మూతపడిపోయిన పాఠశాలను తెరవాలంటూ అధికారులను అభ్యర్థించారు. ఇందుకు ఆ గ్రామ పెద్ద కూడా సహకరించారు.

* కరోనా నిర్థారణ పరీక్షల కోసం హైదరాబాద్‌ నిమ్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘కోబాస్‌ 8800’ యంత్రాన్ని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉన్నామని, ఇప్పటికే అనేక రకాల పరికరాలను సమకూర్చామన్నారు.