Movies

సమాధానాలు చెప్పిన రకుల్

Rakul Preet Appears Before NCB

నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తాజాగా నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ అనుమానాస్పద మృతి కేసును డ్రగ్స్‌ కోణంలో విచారిస్తోన్న పోలీసులు నటుడి ప్రేయసి రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకుని గత కొన్నిరోజులుగా విచారణ చేస్తున్న విషయం విధితమే. విచారణలో భాగంగా రియా చక్రవర్తి, సుశాంత్‌ టాలెంట్‌ మేనేజర్‌ జయాసాహా వెల్లడించిన పలు విషయాలతోపాటు వారిద్దరికి చెందిన వాట్సాప్‌ సందేశాలను ఆధారంగా చేసుకుని రకుల్‌ ప్రీత్‌సింగ్‌, దీపికా పదుకొణె, సారా అలీఖాన్‌, శ్రద్ధాకపూర్లకు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది.