DailyDose

కంచి పీఠం వేదపాఠశాలగా బాలు నివాసం-తాజావార్తలు

Breaking News - SPB Donates His Home To Kanchi Peetham

* ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కోనేటమ్మపేటలో తన తండ్రి నిర్మించిన ఇంటిని కంచి పీఠానికి విరాళంగా అందజేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతిని తన నివాసానికి ఆహ్వానించి నెల్లూరులోని ఇంటిని విరాళంగా అందిస్తున్నట్లు తెలియజేశారు. బాలులోని సేవాగుణాన్ని మెచ్చుకున్న విజయేంద్ర సరస్వతి సదరు ఇంటిలో వేద పాఠశాల నిర్వహిస్తామని చెప్పారు. పీఠాధిపతి నిర్ణయంతో ఎంతో సంతోషించిన బాలు.. తన నివాసం ఓ గొప్ప కార్యక్రమానికి వేదికవుతోన్నందుకు ఆనందంగా ఉందని ఆనాటి కార్యక్రమంలో వెల్లడించారు.

* సోమవారం నుంచి జరగాల్సిన డీఎడ్ మొదటి సంవత్సరం పరీక్షలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఒకవైపు కరోనా ఉద్ధృతి కొనసాగుతుండటం, మరోవైపు భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.

* Government has permitted TSRTC to restore Interstate bus services to Karnataka(except Services to Bengaluru) and Maharashtra states from the morning of 28.09.2020. The corporations of Karnataka and Maharashtra states will also restore their operation to Telangana. Important routes are Raichur, Bidar, Nanded, Mumbai, Pune, Gulbarga, Nagpur, Chandrapur etc.

* ఖుర్దా రోడ్- అహ్మదాబాద్ మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఏ.కె. త్రిపాఠి తెలిపారు. ఖుర్దా రోడ్-అహ్మదాబాద్ (08407) ప్రత్యేక వారాంతపు ఎక్స్ ప్రెస్ రైలు ఈ నెల 30 నుంచి అక్టోబర్ 21 వరకు ప్రతి బుధవారం ఖుర్దా రోడ్​లో బయలు దేరనున్నట్లు తెలిపారు.

* ఆస్తి కోసం కన్నతండ్రి గొంతు కాలితో తొక్కిన ఘటన గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముదిమి వయస్సులో కన్నతండ్రికి ఓ ముద్ద పెట్టాల్సిన కొడుకులు ఇచ్చిన ఆస్తి చాల్లేదంటూ రాక్షసులుగా మారారు. వృద్ధుడైన తండ్రిని కర్రతో విచక్షణా రహితంగా కొట్టడమే కాకుండా గొంతుపై కాలేసి తొక్కేశారు కర్కోటకులు. కసాయి కొడుకుల దాష్టీకానికి బలైన తండ్రి కోమాలోకి వెళ్లి.. అటు నుంచి అటే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ అత్యంత అమానుష ఘటన ఏపీ రాజధాని ప్రాంతం అమరావతిలో చోటుచేసుకుంది.

* కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకుంటలో ఐపీఎల్- 2020 మ్యాచ్ లపై బెట్టింగ్‌కు పాల్పడుతున్న పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాను బుకీ నంద్యాలకు చెందిన గిరిని మొదట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ. 2,35,000 నగదు, 8 సెల్ ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

* దేవాల‌యాలపై జ‌రుగుతున్న దాడుల వెనుక కుట్ర‌కోణం దాగి ఉంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ అనుమానం వ్య‌క్తం చేశారు.

* ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు అవసరం అని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను ఐరాస భద్రతా మండలిలో నిర్ణయాధికారానికి ఇంకెంతకాలం దూరంగా ఉంచుతారని ప్రశ్నించారు. యావత్‌ ప్రపంచం కరోనా వ్యాక్సిన్‌ కోసం భారత్‌వైపు చూస్తోందన్నారు. తమకున్న సామర్థ్యంతో మానవాళిని ఈ మహమ్మారి నుంచి బయటపడేయగలమని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఐరాస సర్వప్రతినిధి సభ 75వ వార్షిక సమావేశంలో వేదికపై ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు.

* మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ శనివారం 88వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయనకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘లోతుగా విశ్లేషించే డా.మన్మోహన్‌సింగ్ లాంటి ప్రధాని లేని లోటు దేశంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన నిజాయితీ, అంకితభావం మనందరికి స్ఫూర్తినిస్తాయి’ అని రాహుల్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీ సహా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పలువురు నేతలు మాజీ ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.