WorldWonders

నేను టీ మాత్రమే తాగుతాను

నేను టీ మాత్రమే తాగుతాను

*ఆహారం లేకుండా ఒక్కరోజు ఉండొచ్చు, రెండు రోజులు ఉండొచ్చు. అయితే.. బంగాల్​కు చెందిన ఓ బామ్మ మాత్రం తిండి లేకుండా కేవలం టీ తోనే జీవిస్తోంది. ఒక్కపూట తినకపోతేనే చికాకుగా ఫీలవుతుంటారు చాలామంది. కానీ 30 ఏళ్లుగా ఆమె ఎలా జీవిస్తోంది.
**బంగాల్​లో ఓ వృద్ధురాలు కేవలం టీ, పాన్​లతోనే జీవనం సాగిస్తోంది. ఒక్కపూట తిండి లేకపోతేనే ఆకలితో విలవిల్లాడిపోతుంటారు కొందరు. అయితే నందరాణి మహంత అనే 67 ఏళ్ల వృద్ధురాలు మాత్రం ఇందుకు భిన్నం. ఆహారమే లేకుండా 30 ఏళ్లుగా టీతోనే జీవిస్తోంది.
**రోజుకు 10-12 కప్పుల టీ.
దక్షిణ దినాజ్​పుర్​కు చెందిన మహంతకు ఓ కుమారుడు (రంజిత్​ మహంత) ఉండేవాడు. అయితే.. కుటుంబ సమస్యల కారణంగా 30 ఏళ్ల క్రితమే అతడు బంగ్లాదేశ్​కు తరలిపోయాడు. అప్పటి నుంచి బలూర్​ఘాట్​లో నివసిస్తూ.. ఇలా పాలతో కూడిన టీకు అలవాటుపడింది మహంత. ఆహారమనేదే లేకుండా.. రోజుకు 10-12 కప్పులు టీ తాగుతుంది. దీనికి తోడు పాన్​ కూడా వేసుకుంటుంది. జీవనాధారం కోసం మరమరాలు, నిత్యవసర వస్తువుల వ్యాపారం చేస్తుంది. అప్పుడప్పుడూ మరమరాలను తింటుంటానని చెబుతుంది.
**అయినా ఫిట్​..
ఇలా మూడు దశాబ్దాలుగా ఆహారం తీసుకోకపోయినా మహంత ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. మిల్క్​టీలో ఉండే కార్బోహైడ్రేట్​, ప్రోటీన్ లాంటి పోషకాల వల్ల ఇది సాధ్యమవుతుందని తెలిపారు. ఇక టీలోని చక్కెర ఆమె శరీరానికి అవసరమైన క్యాలరీలను అందిస్తుందని పేర్కొన్నారు.