NRI-NRT

టెక్సాస్ నీటిలో భయంకర అమీబా

Officials Warn Not To Drink Water From Texas Public Water System

టెక్సాస్‌లోని లేక్ జాక్సన్ నగర వాసులకు అక్కడి అధికారులు కీలక సూచన చేశారు.

ట్యాప్ వాటర్‌ను నేరుగా ఉపయోగించొద్దని ప్రకటించారు.

ట్యాప్ వాటర్‌ శాంపిళ్లలో ప్రాణాంతకమైన మెదడును తినే అమీబా నాగ్లేరియా ఫౌలేరిని గుర్తించినట్లు వెల్లడించారు.

తాగడానికి, వంట చేసుకోవడానికి కాచిచల్లార్చిన నీటిని ఉపయోగించాలని పేర్కొన్నారు.

ముక్కులోకి నీరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై హానికరమైన బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు అధిక ప్రభావాన్ని చూపిస్తాయని తెలిపారు.

కాగా జోసియా మెకింటైర్ అనే ఆరేళ్ల బాలుడు.. నీటిలో ఆడుకున్న తర్వాత తీవ్ర ఆనారోగ్యానికి గురై సెప్టెంబర్ 8న మరణించినట్లు చెప్పారు.

నాగ్లేరియా ఫౌలేరి వల్లే ఆ చిన్నారి మరణించాడని ఆధారాలు లభించాయని.. అనంతరం వివిధ ప్రాంతాల్లో నీటిని సేకరించి పరీక్షించినట్లు తెలిపారు.

నీటి శాంపిళ్లలో.. నాగ్లేరియా ఫౌలేరిని గుర్తించినట్లు వివరించారు.