DailyDose

నలుగురు హీరోయిన్ల ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు-నేరవార్తలు

Police Seize Four Heroines Phones In Drugs Case

* బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణను వేగవంతం చేసింది ఎన్సీబీ. నలుగురు హీరోయిన్లను ప్రశ్నించి.. కీలక సమాచారం రాబట్టింది. ఈ కేసులో ఇప్పటికే రకుల్‌ ప్రీత్‌సింగ్‌ను ప్రశ్నించిన ఎన్సీబీ, నిన్న మరో ముగ్గురు హీరోయిన్లు.. దీపికా పదుకొణె, శ్రద్ధాకపూర్‌, సారా అలీఖాన్‌లను వేర్వేరుగా విచారించింది. ఈ సందర్భంగా వారిని.. ఎన్సీబీ అధికారులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్టు తెలుస్తోంది. అయితే…ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ డ్రగ్స్‌ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఈ నలుగురి హీరోయిన్ల ఫోన్లను ఎన్సీబీ అధికారులు సీజ్‌ చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకే ఈ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు బీటౌన్‌లో ప్రచారం జరుగుతోంది. కాగా ఈ కేసులో ఇప్పటి వరకు 19 మందిని అదుపులోకి తీసుకున్నామని…తాజాగా నలుగురు హీరోయిన్ల స్టేట్‌మెంట్‌ రికార్డు చేసినట్లు వెల్లడించారు అధికారులు.

* పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బల్లపై మృతిచెందిన గుర్తుతెలియని మహిళహస్పటల్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని పరిశీలించికేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ మహిళ ఎవరు ఈమె పేరు వివరాలు ఏ గ్రామానికి సంబంధించిన మహిళ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అన్న పూర్తి వివరాలు ఆరా తీస్తున్న పోలీసులు

* గుజరాత్​లోని గోద్రా వద్ద ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 35 మంది గాయపడ్డారు. వారిలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వడోదర ఆస్పత్రికి తరలించారు.

* పాకిస్థాన్​లో జరిగిన ఘోర వ్యాను ప్రమాదంలో 13 మంది మరణించారు.22 మందితో ప్రయాణిస్తున్న వ్యాను హైదరాబాద్ సమీపంలోని నూరియాబాద్​ వద్ద అదుపుతప్పి ఒక్కసారిగా తలకిందులైపోయింది. బోల్తా కొట్టిన అనంతరం వ్యానుకు నిప్పంటుకుంది.దీంతో ప్రయాణికుల్లో పలువురుకు అగ్నికి ఆహుతైపోయారు.ఏడాది వయసున్న ఓ చిన్నారి, డ్రైవర్‌ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.పాకిస్థాన్​లోని హైదరాబాద్ నుంచి కరాచీకి ఈ వ్యాను ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.వ్యాను కింది భాగంలో ఉండే ‘టై రాడ్‌’ విరిగిపోవడం వల్లే వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.ఆ సమయంలో వాహన వేగం అధికంగా ఉండడంతో బోల్తా కొట్టిన వ్యానులో వెంటనే మంటలు అంటుకున్నాయని కరాచీ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.అవి కాస్తా ఇంధన ట్యాంకుకు వ్యాపించడంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయని.. దీంతో ప్రయాణికులు మృతి చెందారని వెల్లడించారు

* కడప జిల్లాలో అంతర్రాష్ట్ర దోపిడీ గ్యాంగ్ కలకలం..21 మంది దోపిడీ దొంగలను అదుపులోకి తీసుకున్న రాజంపేట పోలీసులు….జిల్లా వ్యాప్తంగా దొంగతనాలకు దోపిడీ దొంగల ముఠా స్కెచ్..రాజంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డ్ మెంబర్ మేడా మలికార్జున రెడ్డి ఇంటివద్ద రెక్కీ చేస్తుండగా పోలీసులకు పట్టుబడిన వైనం….వారి వద్ద నుంచి నుంచి 10 వేల 360 నగదు, ఒక పిస్టల్, నాలుగు పిస్టల్ రౌండ్లు, ఒక కారు, మూడు మోటార్ సైకిల్ లు, 15 మొబైల్ ఫోన్లు స్వాధీనం..బళ్ళారి, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడినట్లు జిల్లా ఎస్పీ అన్బు రాజన్ మీడియాకు సమాచారం వెల్లడి….

* మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసుపై జిల్లాలో సీబీఐ విచారణ కొనసాగుతోంది.

* స్మార్ట్ ఫోన్ కొనివ్వడం లేదని ఇంటర్​ చదువుతున్న యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలం కిష్టాపూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. లక్షెట్టిపేట మండలం రంగపేట గ్రామానికి చెందినా రవి, సత్యమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు. భార్యభర్తల మధ్య గొడవలతో ఐదేళ్లుగా సత్యమ్మ తన ఊరు కిష్టాపూర్ లో పిల్లలతో కలిసి పని చేసుకుంటూ జీవిస్తోంది. సత్యమ్మ కూతురు ప్రవలిక మంచిర్యాలలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండియర్​ చదువుతుంది. కరోన నేపథ్యంలో ఆన్ లైన్ క్లాసులకు స్మార్ట్ ఫోన్ తప్పనిసరి కావడంతో చాలారోజులుగా తల్లిని కొనమని అడుగుతోంది. తల్లి కొనకపోవడంతో ఈ నెల 20న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది.