Movies

సయా…ఆయా

సయా…ఆయా

బాలీవుడ్‌ భామలు టాలీవుడ్‌కి రావడం కొత్తే కాదు. ఇప్పుడు మరో బ్యూటీ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఆమె ఎవరో కాదు.. పలు తెలుగు చిత్రాల్లో నటించిన నటుడు, దర్శకుడు మహేశ్‌ మంజ్రేకర్‌ కుమార్తె. తండ్రి బాటలో సయీ కూడా తెలుగుకి ఆయా (వచ్చింది) అన్నమాట. ‘మేజర్‌’ చిత్రం ద్వారా తెలుగు తెరపై కనిపించనుందామె. సల్మాన్‌ ఖాన్‌ ‘దబాంగ్‌–3’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సయీ అందర్నీ ఆకట్టుకున్నారు.అక్టోబర్‌ నెలలో హైదరాబాద్‌లో జరగనున్న ‘మేజర్‌’ షూటింగ్‌లో పాల్గొననున్నారామె. 2008 నవంబర్‌ 26న జరిగిన ముంబై టెర్రరిస్ట్‌ దాడుల్లో మృతి చెందిన మేజర్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఉన్నికృష్ణన్‌ పాత్రలో శేష్‌ అడివి నటిస్తున్నారు. ఇందులో శోభిత దూళిపాళ్ల హీరోయిన్‌. సయీ మంజ్రేకర్‌ది కీలక పాత్ర. జి.యం.బి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మహేశ్‌బాబు, సోనీ పిక్చర్స్, ఏప్లస్‌ ఎస్‌ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శికిరణ్‌ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు.