DailyDose

ఏపీ మంత్రులకు కరోనా-TNI బులెటిన్

ఏపీ మంత్రులకు కరోనా-TNI బులెటిన్

* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు కరోనా సోకింది. ఆయనకు తాజా వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. మంత్రి వేణుగోపాలకృష్ణ ఇటీవలే సీఎం జగన్ తో కలిసి తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. నిన్న తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో మంత్రి ధర్మానతో కలిసి రథం పనులకు ప్రారంభోత్సవం చేశారు.కరోనా వైరస్ భూతం సామాన్యులు, ప్రముఖులు అన్న తేడా లేకుండా అందరినీ వెంటాడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు కరోనా బారినపడ్డారు. పైడికొండల మాణిక్యాలరావు, బల్లి దుర్గాప్రసాద్ వంటి నేతలు మరణించడం తెలిసిందే. వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి కూడా కరోనా పాజిటివ్ రావడంతో హైదరాబాద్ అపోలోలో చికిత్స పొందారు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సైతం కరోనా ప్రభావానికి గురై కోలుకున్నారు.

* ఆంధ్ర్రప్రదేశ్ దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‍కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం వారం రోజులపాటు అక్కడే ఉన్న మంత్రి కరోనా టెస్టులు జరిపించుకోగా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. తిరుమల బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన సీఎం జగన్ కు పక్కనే ఉండి అన్ని కార్యక్రమాలను మంత్రి వెల్లంపల్లి జరిపించారు. వివాదాల నేపధ్యంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా వారం పాటు తిరుమలలోనే మకాం వేశారు. బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు తిరుమలలోనే ఉన్నమంత్రి ఈ నెల 25వ తేదీన విజయవాడ చేరుకున్నారు. వారం పాటు బయట ఉండి రావడంతో ముందు జాగ్రత్తగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిపించుకోగా.. స్వల్పంగా కోవిడ్ లక్షణాలతో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మంత్రి వెల్లంపల్లి ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్నారు.

* మరో మూడు రోజుల్లో అన్ లాక్ 5.0… సడలింపులు ఇవే!అక్టోబర్ 1 నుంచి అన్ లాక్ 5.0దేశంలో ప్రారంభంకానున్న దసరా – దీపావళి సీజన్సినిమా హాల్స్, టూరిజం తిరిగి ప్రారంభమయ్యే అవకాశంనేడో, రేపో నూతన విధివిధానాలు, మరిన్ని సడలింపులుభారతావని అన్ లాక్ 4.0ను సెప్టెంబర్ 30తో ముగించుకుని, అక్టోబర్ 1 నుంచి అన్ లాక్ 5.0లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకూ ఐదో విడత అన్ లాక్ పై మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించలేదు. అయితే, గతంతో పోలిస్తే మరిన్ని సడలింపులు ఉంటాయని కేంద్ర వర్గాలు అంటున్నాయి.

* రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 66,121 నమూనాలను పరీక్షించగా 5,487 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,81,161కి చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 7,210 మంది కరోనా నుంచి కోలుకోగా.. చికిత్స పొందుతూ 37 మంది మృతిచెందారు.

* కరోనా వైరస్‌ మహమ్మారికి ఆయుర్వేద విధానంలో ఔషధాన్ని కనుగొనేందుకు చేపట్టిన క్లినికల్‌ ట్రయల్స్‌లో సంచలనాత్మక ఫలితాలు వెలువడినట్టు తెలిసింది. శాస్త్రీయ విధానంలో కంటే ఆయుర్వేద పద్ధతిలో చికిత్స పొందుతున్న రోగులకు కొవిడ్-19 సమస్య త్వరగా నయమౌతోందని ఈ ఫలితాల్లో వెల్లడైంది. క్లినికల్‌ ట్రయల్స్‌ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా అనుమతి పొందిన అనంతరం.. ఇమ్మ్యునో ఫ్రీ, రెజిమ్యూన్‌లకు సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ను దేశంలోని మూడు ఆస్పత్రుల్లో నిర్వహించారు. శ్రీకాకుళంలోని గవర్నమెంట్‌ మెడికల్‌ హాస్పిటల్‌, గుజరాత్‌, వడోదరాలోని పారుల్‌ సేవాశ్రమ్‌ ఆస్పత్రి, మహారాష్ట్ర, పుణెలో లోక్‌మాన్య ఆస్పత్రిలో ఈ క్లినికల్‌ పరీక్షలు జరిగాయి.