DailyDose

దళిత కుటుంబంపై వైకాపా శ్రేణుల దాడి-నేరవార్తలు

దళిత కుటుంబంపై వైకాపా శ్రేణుల దాడి-నేరవార్తలు

* అనంతపురం జిల్లా ఓబులవారి పల్లెలో దారుణం జరిగింది. దళిత సామాజిక వర్గానికి చెందిన కుటుంబంపై వైసీపీ అనుచరులు దాడి చేశారు. ప్రాణ భయంతో ఆ కుటుంబ సభ్యులు కదిరిలో ఓ లాడ్జిలో తలదాచుకున్నారు. దాడి చేసిన వారి వెనుక అధికారపార్టీ నేతల హస్తం ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల ప్రొద్భలంతో విచక్షణారహితంగా తమపై దాడి చేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. పోలీసులు పక్షపాతం వహిస్తున్నారని బాధితులు ఆరోపించారు.

* మైదుకూరు మండల పరిధిలోని కేసీ ప్రధాన కాల్వలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం.కేసీ ప్రధాన కాలువ లో బెల్లమోల్ల తూము వద్ద గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని మంగళవారం పోలీసులు కనుగొన్నారు.మృతుని వయస్సు సుమారు 25 ఏళ్ళు.ముదురు నీలం జీన్స్ పాంట్, నస్యం,నలుపు రంగులతో ఉన్న గళ్ళ చొక్కా ధరించివున్నాడు.పాంటుకు నల్లటి బెల్ట్ పెట్టుకొని వున్నాడు.ముఖానికి గుబురుగా గడ్డం పెరిగి ఉంది.మృతున్ని ఎవరైనా గుర్తించి మైదుకూరు పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

* అచ్చం సినిమాల్లో జరిగినట్లు గానే వికారబాద్ లో ఆదివారం రోజున ఓ వివాహితను కొంత మంది కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు ఈ కిడ్నాప్ కేసును ఛేదించడానికి మొత్తం 6 బృందాలుగా ఏర్పడి గాలింపును చర్యలు చేపడుతున్నారు. దీపిక కిడ్నాప్ వ్యవహారాన్ని సవాలుగా తీసుకున్న పోలీసులు అటు అఖిల్ బంధువులను ఇటు వారి స్నేహితులను విచారిస్తున్నారు. అంతే కాదు కిడ్నాప్ జరిగి ప్రదేశం నుంచి కారు ఎటువైపు వెళ్లింది పూర్తి దృష్యాలను సీసీ కెమెరాలలో చూసే ప్రయత్నం చేయగా అవి పనిచేయకపోవడంతో వారు ప్రయణించిన కారు ఎటువైపు వెళ్లిందో కనిపెట్టడం పోలీసులకు కష్టతరంగా మారింది. దీంతో అసలు కిడ్నాపర్లు దీపికను ఎక్కడికి తీసుకెళ్లారు, అసలు దీపికను ఎవరు తీసుకెళ్లారు అని అనేది మాత్రం పోలీసులు బయటకి చెప్పడం లేదు. దీపిక తన భర్త వద్దే ఉందని అనుమానం వ్యక్తం చేస్తు న్నామని త్వరలో కేసు ఛేదిస్తాం అంటున్నారు.

* తిరుపతి స్విమ్స్, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో చికిత్స నిమిత్తం చేరిన కరోన పేషెంట్ల యొక్క నగలు దొంగిలించిన వ్యక్తులు అరెస్ట్.తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్.

* రూ 5 వేలు లంచం తీసుకుంటూ గాజువాక ఏ ఎస్ ఐ పట్టివేత. యాక్సిడెంట్ కేసులో స్టేషన్ బెయిలు ఇచ్చేందుకు లంచం డిమాండ్. వల పన్ని పట్టుకున్న ఏసీబీ

* క‌రోనా పాజిటివ్ రోగులకు అనుమతుల్లేకుండా వైద్యం అందిస్తున్న ఆస్పత్రులపై దాడులు చేసి చర్యలు తీసుకోండి. అధికారులను ఆదేశించిన గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్

* వారసుడు కావాలని…. మామే మృగమయ్యాడు..!ఆమెది… ప్రేమ వివాహం పెద్దల అంగీకారంతోనే జరిగింది సంసార జీవితం ఆనందంగా సాగింది ఇద్దరు అమ్మాయిలకు అమ్మయింది..!!మగ పిల్లవాడు పుట్టలేదని… మామే లైంగిక వేధింపులకు దిగాడు వాటిని భరించలేక..అతన్ని ఎదిరించలేక భర్తకు చెప్పుకుంటే సర్దుకుపొమ్మన్నాడు అత్తకు విన్నవిస్తే మామూలే కదా అంది నిస్సహాయ స్థితిలో స్టేషన్‌ గడపతొక్కింది..!!అసలేం జరిగిందో బాధితురాలి ఆవేదన ఆమె మాటల్లోనే తెలుసుకుందాం…మాది గుంటూరు. నేను ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న క్రమంలో అక్కడే పనిచేస్తున్న యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో 2016లో వివాహం చేసుకున్నాం. మాకు ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారు. అప్పటి నుంచి మగపిల్లాడిని కనలేదంటూ భర్త వేధించడం ప్రారంభించాడు. అతని ప్రవర్తనపై మామయ్యకు చెపితే.. మాకు వారసుడు కావాలి. నువ్వు నాతో ఉండు. నేను చూసుకుంటానన్నాడు. నీ కుమార్తె లాంటి దాన్ని అలా మాట్లాడటం పద్ధతి కాదంటే ఇవన్నీ మామూలే అన్నాడు. అప్పటి నుంచి లైంగికంగా వేధించడం మొదలెట్టాడు. భర్త, మామలు పెట్టే బాధలు భరించలేక పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లాను. మామయ్య నా పిల్లలను చూడాలని సాకుగా చెప్పి మా ఇంటికి వచ్చి అమ్మా, నాన్న ఇంట్లో లేని సమయంలో లైంగిక దాడి చేయబోగా బయటకు వచ్చేశాను. ఈ విషయం అమ్మానాన్నలకు చెప్పుకోలేక భర్తకు చెప్పుకున్నా. ఆయన నాన్నతో సర్దుకుపొమ్మని చెప్పాడు. పెద్దది కదా అర్థం చేసుకుంటుందని అత్తమ్మకు విన్నవిస్తే ఈ రోజుల్లో ఇవి మామూలే కదా అని ఆయన్నే వెనుకేసుకొచ్చింది. దీంతో వారిని ఎదిరించే శక్తి లేక.. ఆ ఇంటికి వెళ్లి ఉండే సాహసం చేయలేక.. మామ, భర్తపై చర్యలు తీసుకొని నాకు రక్షణ కల్పించాలని సోమవారం జరిగిన పోలీసు స్పందన కార్యక్రమంలో ఏఎస్పీ గంగాధరంను కలసి,మామ భర్తపై చర్యలు తీసుకొని నాకు రక్షణ కల్పించాలని సోమవారం జరిగిన పోలీసు స్పందన కార్యక్రమంలో ఏఎస్పీ గంగాధరంను కలసి విన్నవించుకున్నా. ఆయన స్పందించి వెంటనే విచారించి చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించారు.