NRI-NRT

మన్నేకు పితృవియోగం

TDP Leader Manne Lakshminarayana Chowdary Passes Away

తానా బ్యాక్‌ప్యాక్ కమిటీ ఛైర్మన్, గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సంఘం మాజీ అధ్యక్షుడు వర్జీనియాకు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు మన్నే సత్యనారాయణ తండ్రి మన్నే లక్ష్మీనారాయణ చౌదరి(79) ఆదివారం రాత్రి ఆయన స్వగ్రామంలో మృతిచెందారు. తూగో జిల్లాలో ప్రముఖ తెదేపా నాయకుడిగా లక్ష్మీనారయణ మృతి పట్ల పలువురు తెదేపా నాయకులు సంతాపాన్ని వెలిబుచ్చారు. స్థానికంగా ఉన్న పలువురు ప్రవాసాంధ్రులు మన్నే సత్యనారాయణను పరామర్శించి ఆయన తండ్రి మృతిపట్ల సంతాపాన్ని ప్రకటించారు.