Business

అక్టోబర్ బ్యాంకు సెలవులు ఇవి-వాణిజ్యం

అక్టోబర్ బ్యాంకు సెలవులు ఇవి-వాణిజ్యం

* దేశవ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు 2020 అక్టోబర్ నెలలో 14 రోజులు పనిచేయవు. ఈ సెలవుల్లో రెండు, నాలుగు శనివారాలు ఆదివారాలు కూడా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకం ప్రకారం, అన్ని ప్రభుత్వ సెలవు దినాల్లో బ్యాంకుల సెలవు. ఆర్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం, అక్టోబర్ సెలవుల జాబితాలో గాంధీ జయంతి, మహాసప్తమి, దసరా పండుగ, మిలాద్ ఉన్ నబీ ఉన్నాయి. ఇక అక్టోబర్ 4, 11, 18, 25 తేదీలలో ఆదివారాలు. అలాగే అక్టోబర్ 10, 24 తేదీలు రెండో, నాలుగో శనివారాలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో శని, ఆదివారాల్లో నవమి, దసరా (అక్టోబరు 25) పండుగ లొచ్చాయి.అక్టోబర్ 2020 : ప్రధాన సెలవులుఅక్టోబర్ 2 (శుక్రవారం) – మహాత్మా గాంధీ జయంతి (అన్ని రాష్ట్రాలు)అక్టోబర్ 8 (గురువారం) – చెల్లం (ప్రాంతీయ)అక్టోబర్ 23 (శుక్రవారం) – మహాసప్తమి (చాలా రాష్ట్రాలు)అక్టోబర్ 26 (సోమవారం) – విజయ దశమి (చాలా రాష్ట్రాలు)అక్టోబర్ 29 (గురువారం) – మిలాద్ ఉన్ నబీ (ప్రాంతీయ)అక్టోబర్ 31 (శనివారం) – మహర్షి వాల్మీకి, సర్దార్ పటేల్ జయంతి (ప్రాంతీయ)

* వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు పెరిగాయి. సెప్టెంబర్‌ నెలకు సంబంధించి మొత్తం రూ.95,480 కోట్లు జీఎస్టీ రూపంలో వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇవే అత్యధిక వసూళ్లు కావడం గమనార్హం. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈసారి వసూళ్లు 4 శాతం మేర పెరగ్గా.. ఈ ఏడాది ఆగస్టుతో పోలిస్తే 10 శాతం మేర పెరిగాయి.

* మీ డెబిట్‌/ క్రెడిట్‌ కార్డు ఫ్రాడయ్యిందా? ఎక్కడో ఉండి మీ డబ్బులు కొట్టేశారా? ఇక నుంచి అలాంటి వాళ్ల ఆటలు సాగవు. ఎవరైనా అర్జంటుగా పదివేలు కావాలని కార్డు తీసుకుని లక్షల రూపాయలు వాడేశారా? ఇకపై అలాంటివీ కుదరవు. అలాంటి మోసాలకు అవకాశం లేకుండా మీ కార్డులను లాక్‌ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇదే కాదు వాహనదారుల ధ్రువపత్రాలు, టీవీల ధరలు, పెట్రోల్‌ పంపుల్లో చెల్లింపులకు సంబంధించి కొన్ని నిబంధనలు గురువారం నుంచే కొత్తగా అమల్లోకి వచ్చాయి. అవేంటో చూసేయండి.

* దేశీయ మార్కెట్లు మరోసారి భారీ లాభాల్లో ముగిశాయి. అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలు వెలువడడం, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో మన మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ఫైనాన్షియల్‌, ఆటోమొబైల్‌, మెటల్‌ షేర్ల అండతో దూసుకెళ్లాయి. దీంతో సెన్సెక్స్‌ 600 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 11,400 మార్కును మళ్లీ అందుకుంది.

* డిజిటల్‌ చెల్లింపుల వేదిక ఫోన్‌పే గత 5 నెలల కాలంలో ఐదు లక్షల బీమా పాలసీలను విక్రయించినట్లు తెలిపింది. కొన్ని బీమా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని అంతర్జాతీయ-స్వదేశీ ప్రయాణ బీమా, కొవిడ్‌-19, ఆసుపత్రి డైలీ క్యాష్‌, డెంగీ, మలేరియా, వ్యక్తిగత ప్రమాద బీమాలాంటి పాలసీలు విక్రయించింది. తమ వినియోగదారుల్లో 70శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన వారేనని, అందులో ఎక్కువమంది తొలిసారిగా బీమా పాలసీని తమ ద్వారానే తీసుకున్నారని వెల్లడించింది. ఫోన్‌పే ద్వారా బీమా విక్రయాలు ఎక్కువగా జరిగిన నగరాల్లో విశాఖపట్నం, విజయవాడ, అహ్మదాబాద్‌, ఔరంగాబాద్‌ తదితర నగరాలున్నాయి. తక్కువ ధరకు బీమా పాలసీలను అందిస్తున్నామని ఆర్థిక సేవల విభాగం ఉపాధ్యక్షుడు హేమంత్‌ గలా పేర్కొన్నారు.

* అమెరికాలో రిసార్ట్‌ వ్యాపారం దిగాలు పడడంతో వాల్ట్‌ డిస్నీ 28,000 మంది వరకు సిబ్బందిని తొలగించనుంది. కరోనా నేపథ్యంలో భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల్లో ఇదీ చేరనుంది. దీంతో కంపెనీకి చెందిన థీమ్‌ పార్కులు, క్రూయిజ్‌ షిప్‌లు, రిటైల్‌ వ్యాపారాలపై ప్రభావం పడనుందని డిస్నీ పేర్కొంది. ఈ కోతల్లో ఎగ్జిక్యూటివ్‌లు, వేతన ఉద్యోగులు కూడా ఉన్నట్లు వివరించింది. అయితే తొలగిస్తున్న వారిలో 67 శాతం తాత్కాలిక సిబ్బందేనని వెల్లడించింది. వీరికి 90 రోజుల జాబ్‌ ప్లేస్‌మెంట్‌ సేవల వంటి ప్రయోజనాలను అందిస్తోంది.