Devotional

కలశంపై కొబ్బరికాయ వెనుక కథ అది

కలశంపై కొబ్బరికాయ వెనుక కథ అది

మన సంప్రదాయంలో వ్రతాల వంటివి చేసే సందర్భంలో ఏర్పాటు చేసే కలశం ఈ సృష్టికి ప్రతీక. ‘‘కలశస్య ముఖే విష్ణుః..’’ ఇత్యాది మంత్రాలు ఈ విషయాన్ని వివరిస్తున్నాయి. కలశంపై అమర్చే కొబ్బరికాయ కూడా బ్రహ్మాండానికి సంకేతం. కొబ్బరికాయ పూర్ణఫలం. అదే కాయ, అదే విత్తనం కూడా! మనం అర్చించే దైవం సృష్టిలో అంతటా నిండి ఉన్నాడని, అంతటా ఉన్న పరమాత్మకు ప్రతీకగా ఏదో ప్రతిమను మనం ఏర్పాటు చేసుకున్నామని కొబ్బరికాయ అమర్చిన కలశం తెలియచేస్తోంది. వ్రతపరిసమాప్తి తర్వాత వినియోగించిన అన్ని పూజాద్రవ్యాలతోపాటు కలశంపై కొబ్బరికాయను కూడ నిమజ్జనం చేయాలి.