Health

కిడ్నీలో రాళ్లని పిండిగొట్టే గసగసాలు

Poppy Seeds Will Melt Kidney Stones - Telugu Health News

గసగసాల్ని రోజూ వంటల్లో వాడుతుంటాం. కానీ పూర్వం వీటిని మందుల తయారీలో వాడేవాళ్లు. మిగతా సుగంధ ద్రవ్యాల్లాగే గసగసాలు కూడా చాలా ముఖ్యమైనవి. వాటితో కలిగే ప్రయోజనాలు తెలియక చాలామంది వాటిని వాడడానికి ఆసక్తి చూపరు. గసగసాల్లో దాగున్న ఆరోగ్య ప్రయోజనాలు..

కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చేసే శక్తి గసగసాలకు ఉంది. వీటిలో ఉండే ఆక్సలేట్లు.. క్యాల్షియంను గ్రహించి, రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి. రోజూ వంటల్లో గసగసాల్ని వాడడం వల్ల మలబద్దక సమస్య తగ్గుతుంది. గసగసాల్లో ఫైబర్‌ (పీచు పదార్థం ఎక్కువ. ఇది పేగులు బాగా కదిలేలా చేస్తుంది. దీంతో మలబద్దక సమస్య తగ్గుతుంది. రోజూ ఆహారంలో గసగసాల్ని వాడడం వల్ల నిద్రలేమి సమస్య దరిచేరదు. రోజూ పడుకునే ముందు వేడి పాలలో గసగసాల పొడిని కొద్దిగా వేసుకొని తాగితే చాలు చక్కగా నిద్ర వస్తుంది. శ్వాస సంబంధిత సమస్యలు కూడా గసగసాలతో తొలిగిపోతాయి. అస్తమా, దగ్గు ఉన్న వారికి ఇవి బాగా పనిచేస్తాయి. గుండె సమస్యలు ఉన్నవారు గసగసాలు లైట్‌గా ఫ్రై చేసి, చక్కెర కలుపుకొని ఉదయం సాయంత్రం, అరచెంచాడు తీసుకుంటే గుండెపనితీరు మెరుగుపడుతుంది. గసగసాలు చలువ చేస్తాయి. శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే గసగసాలు వాడితే ఉపశమనం పొందొచ్చు. కడుపులో మంట, ఎసిడిటీ ఉన్నవారు గసగసాల్ని వాడితే పేగుల్లో అల్సర్లు, పుండ్ల వంటివి తగ్గుతాయి.