Health

కరోనాపై పోరాడుతుంది…రాగులు తినండి

చిరుధాన్యాలలో రాగులకి మంచి పేరు ఉంది. రాగులు శరీరానికి మంచి బలాన్ని ఇస్తాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగి పిండిని చిన్నపిల్లలకూ ఆహారంగా పెడతారు. రాగి జావ, రాగి సంగటి, రాగి దోశ, రాగి లడ్డు, రాగి రొట్టె ఇలా ఏ విధంగానైనా మనం వీటిని తీసుకోవచ్చు. రాగి పిండిని జావగా చేసుకుని, పాలతో లేదా మజ్జిగతో కలిపి సేవిస్తే ఫిట్‌గా ఉండవచ్చు. డ్రైఫ్రూట్స్‌లో ఉన్న అనేక గుణాలు ఒక్క రాగులలో ఉన్నాయి. రాగులలో క్యాల్షియం, ఐరన్‌, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఇవి ఎముకలకు, కండరాలకు, దంతాలకు బలాన్ని ఇస్తాయి. ఎసిడిటీ, గ్యాస్‌తో బాధపడేవారికి రాగి జావ అద్భుత ఔషధం. వేసవిలో ఉదయాన్నే రాగి జావ తీసుకుంటే వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. రాగులలో క్యాల్షియంతో పాటు ఫైబర్‌ కూడా అధికంగా ఉంటుంది. దీనివల్ల మలబద్ధకం, అజీర్ణ సమస్యలు దరి చేరవు. గ్లూటిన్‌ సమస్యతో బాధపడుతున్నవారికి రాగులు చాలా మంచి ఆహారం. బాలింతలు రాగితో చేసిన లడ్డూలు తింటే పాలు పడతాయి. రక్తహీనతకు చెక్‌ పెట్టడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడానికి రాగులు ఎంతో దోహదపడతాయి. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు రోజూ రాగుల్ని ఏదో రూపంలో తీసుకుంటే ఇవి క్రమంగా కరిగిపోతాయి. డయాబెటీస్‌, బీపీ, అలసట, ఊబకాయం, అతి ఆకలి వంటి దీర్ఘ వ్యాధులనూ ఈ రాగులు నివారిస్తాయి. ఆస్తమా, గుండె జబ్బులు ఉన్న వారూ రాగులతో వాటిని నయం చేసుకోవచ్చు.