NRI-NRT

వాషింగ్టన్ డీసీలో ఆటా తదుపరి సమావేశాలు

American Telugu Association ATA 2020 Conference Cancelled. Next Conference Will Be In 2022 In DC.

అమెరికన్ తెలుగు సంఘం(ATA) మహాసభలు వచ్చే డిసెంబరు నెలలో లాస్ఏంజిల్స్‌లో జరుపుదామని నిర్ణయించారు. కరోనా ఉద్ధృతి తగ్గకపోవడంతో లాస్ఏంజిల్స్ మహాసభలను రద్దుచేయాలని నిర్ణయించారు. గత 26వ తేదీన డెలావేర్‌లో జరిగిన ఆటా కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2022లో ఆటా మహాసభలు అంగరంగ వైభవంగా వాషింగ్టన్ డీసీలోని వాల్టర్ ఈ కన్వెన్షన్ సెంటరులో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు భీమిరెడ్డి పరమేశ్ తెలిపారు. ఆటాలో ట్రస్టీలను నియమించడానికి ప్రయ్తేక పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రస్టీ పదవులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, వీటిని పరిశీలించి ఎంపిక చేస్తామని తెలిపారు. నామినేషన్ ధర $500 నుండి $1000కి పెంచామని వెల్లడించారు. భారతదేశంలో రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించే ప్రవాసులు ఈ ట్రస్టీ పదవులకు పంపే దరఖాస్తులను తిరస్కరించవల్సిందిగా నామినేషన్ పర్యవేక్షక కమిటీకి సూచనలు చేసినట్లు పరమేశ్ తెలిపారు. వచ్చే జనవరి 16వ తేదీన ఆటా నూతన కార్యవర్గం ఎన్నిక లాస్‌వేగాస్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆటా తదుపరి అధ్యక్షుడు భువనేశ్ బూజాల అధ్యక్షుడిగా ఈ సమావేశాల్లో బాధ్యతలు చేపడతారు. కొత్త కార్యవర్గాన్ని కూడా ఈ సమావేశంలోనే ఎన్నుకుంటారు. విల్మింగ్టన్‌లోని స్థానిక గోదావరి ఈ సమావేశానికి భోజనాన్ని అందించింది. ఈ కార్యక్రమంలో వేముల శరత్, ఆసిరెడ్డి కరుణాకర్, పాశం కిరణ్, రవి పట్లోళ్ల, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
American Telugu Association ATA 2020 Conference Cancelled. Next Conference Will Be In 2022 In DC.-వాషింగ్టన్ డీసీలో ఆటా తదుపరి సమావేశాలు