Devotional

అన్నవరంలో ఆన్‌లైన్ వ్రతాలు

అన్నవరంలో ఆన్‌లైన్ వ్రతాలు

అన్నవరం దేవస్థానంలో ఆన్​లైన్​ వ్రత పూజను లాంఛనంగా ప్రారంభించారు.

కరోనా నేపథ్యంలో ఆలయానికి వచ్చి స్వామి సన్నిధిలో ప్రత్యక్షంగా వ్రత పూజ చేయించుకునే అవకాశం లేని భక్తులకు పరోక్ష పద్దతిలో ఆన్​లైన్​ ద్వారా వ్రత పూజను అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఆన్​లైన్​ ద్వారా దేవస్థానానికి రూ. 1,116 రుసుము చెల్లించే భక్తులకు వ్రత పూజను యూట్యూబ్ లింక్ ద్వారా ప్రత్యక్షంగా ప్రసారం చేస్తారు.

రుసుము చెల్లించే వారి గోత్ర, నామాలతో జరిగే పూజను ఆన్​లైన్​ ద్వారా వీక్షించే అవకాశంతో పాటు, పురోహితులు సూచించే విధంగా ఇంట్లో కూడా వ్రతం చేసుకునే అవకాశం ఉంటుంది.