Health

నీరసంతో బాధపడేవారు రాజ్మా ప్రయత్నించండి

నీరసంతో బాధపడేవారు రాజ్మా ప్రయత్నించండి

చిక్కుడులో ఒక రకం రాజ్మా. వాటికే కిడ్నీ బీన్స్‌ అని పేరు. వీటిని తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రాజ్మా మన దేశంలో ఎక్కువగా ముదురు ఎరుపు, తెలుపు రంగుల్లో లభిస్తాయి.రాజ్మాలో ఫోలిక్‌ యాసిడ్‌ పుష్కలంగా ఉంటుంది. గర్భిణులు వారానికి కనీసం మూడుసార్లు వీటిని తీసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లలకు నాడీలోపాలు రావు. రాజ్మా జుత్తు ఒత్తుగా పెరగడానికీ, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించటానికి దోహదపడతాయి. రాజ్మాలో ప్రొటీన్లు, పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్‌-బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్‌-ఇ, విటమిన్‌-కె, విటమిన్‌-సి, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, పొటాషియం, ఐరన్‌, జింక్‌, సోడియం వంటి ఖనిజ లవణాలు లభిస్తాయి. రాజ్మా రక్తహీనతకు తగ్గిస్తుంది. కండరాలు పెరుగుదలకు దోహదపడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ఊబకాయ సమస్యతో బాధపడేవారు రాజ్మాను ఉడికించి తినడం వల్ల బరువు నియంత్రణలోకి వస్తుంది. రాజ్మాతో కూరలే కాకుండా సూప్‌, సలాడ్‌ వంటివి కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని ఉడికించిన నీటితో రసాన్ని పెట్టుకోవచ్చు. రాజ్మా ఉడికించిన నీటిలో కాస్త ఉప్పు, జీలకర్ర పొడి వేసుకుని తాగితే నీరసం తగ్గుతుంది.