WorldWonders

కిలో టీపొడి ₹40వేలు

కిలో టీపొడి ₹40వేలు

టీ పొడి ధర 50 గ్రాములు రూ.2 వేలు అంటే కిలో రూ.40వేలు. ధర తెలిసి సందర్శకులు విస్తుపోయారు. ప్రకృతి విధానంలో ఆక్సిజన్‌ అధికంగా వినియోగించి బాక్స్‌లలో ఒకటిన్నర ఏళ్లకు పైగా అతి జాగ్రత్తగా ఈ రెండు రకాలు పండించారని నిర్వాహకులు తెలిపారు. తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లా కున్నూరులో తేయాకు ప్రదర్శనలో అద్భుతం చోటు చేసుకుంది. ‘ఏజ్‌ టీ’ టీ పొడి ధర కిలో రూ.40 వేలుగా నిర్ణయించడం సందర్శకులను ఆకర్షించింది. దక్షిణ భారత టీ బోర్డు ఆధ్వర్యంలో కున్నూరు ఉపాసి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ టీ ప్రదర్శనలో, అనేక రకాల గ్రీన్‌ టీ, వైట్‌ టీ, ఎల్లో టీ హెర్బల్ టీ ఇలా పలురకాల టీ పొడులను ప్రదర్శనలో ఉంచారు. ఈ ప్రదర్శనలో ఆర్గానిక్‌ పద్ధతిలో పండించిన తేయాకు పొడికి భారీ ధర నిర్ణయించారు. ఇందులో భూఏర్, ఏజ్ రకం టీ పొడుల ధరలు సందర్శకులకు షాక్ ఇచ్చాయి. ఎందుకంటే.. ఈ టీ పొడి ధర 50 గ్రాములు రూ.2 వేలు అంటే కిలో రూ.40వేలు. ధర తెలిసి సందర్శకులు విస్తుపోయారు. ప్రకృతి విధానంలో ఆక్సిజన్‌ అధికంగా వినియోగించి బాక్స్‌లలో ఒకటిన్నర ఏళ్లకు పైగా అతి జాగ్రత్తగా ఈ రెండు రకాలు పండించారని నిర్వాహకులు తెలిపారు.