Health

నిగ్రహంగా ఉండే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

The benefits of abstination by vatsayana in kamasutra

ప్రపంచానికి శృంగారం అంటే నిజమైన అర్థాన్ని పరిచయం చేసింది.. కామసూత్ర. లవ్ మేకింగ్‌ భావనలు, స్పర్శ వల్ల కలిగే సుఖం గురించి విడమర్చి చెప్పిందీ అద్భుత గ్రంథం. దీన్ని హిందూ తత్వవేత్త వాత్సాయనుడు రాసిన విషయం మనకు తెలిసిందే.ప్రపంచానికి శృంగారం అంటే నిజమైన అర్థాన్ని పరిచయం చేసింది.. కామసూత్ర. లవ్ మేకింగ్‌ భావనలు, స్పర్శ వల్ల కలిగే సుఖం గురించి విడమర్చి చెప్పిందీ అద్భుత గ్రంథం. దీన్ని హిందూ తత్వవేత్త వాత్సాయనుడు రాసిన విషయం మనకు తెలిసిందే. కామసూత్ర గురించి మాత్రమే మనం తెలుసుకునేందుకు ఉత్సుకత చూపాం. కానీ.. వాత్సాయనుడు ఎవరు? ప్రపంచానికి దారి చూపే ఈ గ్రంథాన్ని ఎలా రాశాడు? ఎన్నో వివరణలతో, మరెన్నో భంగిమలతో అంత బాగా వర్ణన ఎలా చేయగలిగారు? తదితర ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. గుప్తుల కాలానికి చెందిన వాత్సాయనుడు గొప్ప తత్వవేత్త. జీవితంలో సుఖం, సంతోషం, ఆనందం, ఆహ్లాదం అంటే ఏంటో సవివరంగా చెప్పారు. కామసూత్ర అనే గ్రంథాన్ని రాసి భావి తరాలకు అందించిన.. అందులోని అర్థాన్ని కూడా అందించారు. క్రీస్తు పూర్వం 400 – క్రీస్తు శకం 200 సంవత్సరాల మధ్య వాత్సాయనుడు కామసూత్రను రాసినట్లు తెలుస్తోంది. ఈ పుస్తకాన్ని ఆయన సెక్స్ ఆనందాన్ని ఎలా పొందాలి అన్న దాని కోసం రాయలేదు. ముందు తరాలు నిజమైన జీవిత సత్యాన్ని, సెక్స్ సైన్స్‌ను తెలుసుకోవాలన్న కాంక్షతో రాశారు.మనిషి తన ఇంద్రియాలను ఎలా అదుపులో ఉంచుకోవాలి.. నిగ్రహంగా ఉంటే కలిగే ప్రయోజనాలేంటి.. ఉండకపోతే దారితీసే పర్యావసాలేంటి.. అని విడమర్చి చెప్పారాయన. సెక్స్‌ను మితంగా, జాగ్రత్తతో చేయాలని సున్నితంగా హెచ్చరించాయన. ఇక.. కామసూత్రను రాసిన వాత్సాయనుడు తన జీవితంలో ఎప్పుడూ సెక్స్‌లో పాల్గొనలేదు. అందుకే ఆయన మహర్షిగా మన్ననలు అందుకొన్నారు. ముద్దులోని మధురిమను ఆయన ఆస్వాదించకపోయినా.. శరీరంలో ఏయే చోట్ల చుంబనాలు ఇవ్వొచ్చు.. కామోద్రేకంతో ఉండేప్పుడు చేసే లవ్ బైట్స్ గురించి కూడా చెప్పారు. పై పెదవి, నోటి అంతర్భాగం, కళ్లు తప్ప మిగతా అన్ని శరీరాంగాలను చుంబించవచ్చని, లవ్ బైట్స్ ఇవ్వొచ్చని వెల్లడించారు. కామసూత్రలో ఆయన 40 రకాల ముద్దులను వివరించారు. అందులో వేటికవే ప్రత్యేకం. వాత్సాయనుడు స్వలింగ సంపర్కుడు కాదు.. అయినప్పటికీ తన కామసూత్రలో దాని గురించి కూడా తెలిపాడు. ఇష్టం లేకపోయినా, తన కర్తవ్యం చెప్పడం కాబట్టి.. స్వలింగ సంపర్కం గురించి వివరించాడు. వాస్తవానికి వాత్సాయన కామసూత్రలో 20 శాతం మాత్రమే సెక్స్ గురించి ఉంటుంది. మిగతా 80 శాతం మనిషి వ్యక్తిత్వం, సైకాలజీ, సెక్స్ రోగాల నుంచి విముక్తి తదితర అంశాలను పొందుపరిచాడు. వాత్సాయనుడి కంటే ముందే.. లవ్ మేకింగ్ గురించి పలువురు తత్వవేత్తలు తెలిపారు. చరాయన, గోతకాముఖ, గోనార్ధియ, గోనికాపుత్ర, సువర్ణనాభ, దత్తాక తదితరులు సెక్స్ గురించి తమ రచనల్లో వివరించారు. అయితే, వాత్సాయనుడి కామసూత్ర ప్రపంచాన్ని ఆకర్షించింది.