DailyDose

హైకోర్టులో మహిళ ఆత్మహత్య యత్నం-నేరవార్తలు

హైకోర్టులో మహిళ ఆత్మహత్య యత్నం-నేరవార్తలు

* హైకోర్టు లో మహిళ కవిత ఆత్మహత్య యత్నం. చాలా రోజులుగా పెండింగులో, ఉన్న కేసులో తీర్పు రాకపోవడంతో, నిరాశ తో ఆత్మహత్య చేసుకోవాలని చూసిన కవిత. హైకోర్టు ఫస్ట్ ఫ్లోర్ నుండి దూకే ప్రయత్నం చేసిన కవిత.కవిత ను అడ్డుకున్న హైకోర్టు సెక్యూరిటి. సెక్యూరిటీ కార్యాలయంలో కూర్చుబెట్టి కవిత ను విచారిస్తున్న సెక్యూరిటీ. గోదావరి ఖని చెందిన కవిత. ఏప్రిల్ 11 న మురళి అనే వ్యక్తి హత్యాచారం చేసాడని ఫిర్యాదు.

* పశ్చిమగోదావరి జిల్లా దేవరాపల్లి మండలంలో 17 మంది గ్రామ వాలంటీర్లను అధికారులు సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు ఎంపీడీవో ఎస్‌వీఎస్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్‌ చేయూత పథకంలో అనర్హులను గుర్తించడంలో విఫలమైనందుకు వాలంటీర్లపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

* చిత్తూరు జిల్లా మదనపల్లెలో ప్రేమ పేరుతో, వంచించి పెండ్లి చేసుకోకుండా మోసం చేశాడని. పీలేరుకు‌ చెందిన మంజుల విలేఖరుల సమావేశంలో వాపోయింది. కడప జిల్లా మైదుకూరుకు‌ చెందిన బ్రహ్మయ్య టిక్ టాక్ ద్వారా పరిచయం ఏర్పడిందని, ప్రేమించుకుని, పెళ్ళి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించిన తరువాత పెండ్లి చేసుకోకుండా తప్పించుకు తిరుగుతున్నాడని, పోలీసులకు పిర్యాదు చేస్తే, న్యాయం చేయలేదని మంజుల ఆవేదన వ్వక్తం చేసింది.

* అతడో ఎమ్మెల్యే. కావాల్సినంత డబ్బు అంతకు మించిన పలుకుబడి వుంది. అతడు కోరుకుంటే కోట్ల కట్నమిచ్చి మరీ పిల్లనిచ్చే సంబంధాలు వస్తాయి. అలాంటి అవకాశాన్ని కాదని ఓ సామాన్య అర్చకుడి కూతురిని ప్రేమించడమే కాకుండా పెళ్లి కూడా చేసుకున్నాడు తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే ప్రభు(34). అయితే ఎమ్మెల్యేను అల్లుడిగా అంగీకరించడానికి ఇష్టపడని పిల్ల తండ్రి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

* జంగారెడ్డిగూడెంలో తనను ఒక యువకుడు వేధిస్తున్నాడంటూ, 100 కి ఫిర్యాదు చేసిన యువతి. ఘటనా ప్రాంతానికి వెళ్ళిన, కానిస్టేబుల్ రాంబాబు. పరిస్థితిని వీడియో తీస్తున్న కానిస్టేబుల్ పై, దాడి చేసిన యువకుడు. ఈ ఘటన పై పోలీసు స్టేషన్ లో, పిర్యాదు చేసిన కానిస్టేబుల్ రాంబాబు, యువతి.

* నెల్లూరు మండలం మడమనూరు గిరిజన కాలనీలో, చలంచర్ల చెంచమ్మ అలియాస్‌ భారతి (44). ని భర్త చెడిమాల శీనయ్య సోమవారం దారుణంగా హత్య చేశాడు. పోలీసుల కథనం మేరకు, మడమనూరుకి చెందిన చెడిమాల శీనయ్య 20ఏళ్ల కిందట మొదటి భార్యను విడిచిపెట్టి చెంచమ్మతో సహజీవనం చేస్తున్నాడు. చెంచమ్మ తొలుత చల్లంచర్ల చెంచయ్య అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు అడపిల్లలు. కొన్నేళ్ల తర్వాత చెంచయ్యను విడిచిపెట్టి చెంచమ్మ పిల్లలతో కలిసి శీనయ్య వద్ద ఉంటోంది. ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం చేసేవారు. ఈ క్రమంలో చెంచమ్మ తరచూ మరో వ్యక్తితో  మాట్లాడుతుండటంతో వివాహేతర సంబంధం నడుపుతున్నట్లు శీనయ్యకు అనుమానం వచ్చింది.

* నటి సనంశెట్టి ఫిర్యాదు మేరకు బిగ్‌ బాస్‌ దర్శిన్‌పై పోలీసులు కేసును నమోదు చేశారు. తమిళ, తెలుగు భాషల్లో కథానాయికగా నటిస్తున్న సనంశెట్టి, నటుడు దర్శిన్‌ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఆ తర్వాత ఆమెను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ విషయమై నటి సనంశెట్టి ఆ మధ్య స్థానిక ఆడయారు మహిళా పోలీస్‌ స్టేషన్‌లో దర్శిన్‌ పై ఫిర్యాదు చేసింది.

* కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం వగరూరు గ్రామంలోని చెరువుకట్ట నరసప్పతాత (లక్ష్మీనరసింహస్వామి) విగ్రహంపై ఉండే శేషపడగలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గ్రామానికి 2 కి.మీ.దూరంలో సూగూరు జలాశయం వద్ద ఉన్న ఆలయంలో ప్రతి సోమ, గురువారాలు పూజారి పూజలు చేస్తారు. మిగిలిన రోజుల్లో ఆలయానికి తాళం వేసి ఉంటుంది. సోమవారం ఉదయం పూజారి నాగరాజు ఆలయానికి వచ్చి చూడగా విగ్రహంపైన ఉండే తొమ్మిది శేషపడగల్లో నాలుగింటి తలలు ముక్కలుగా పడి ఉన్నాయి. ఆయన స్థానికులకు తెలిపి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

* నేడు రెండవరోజు ఏసీబీ కస్టడికి ఏసీపీ నర్సింహారెడ్డి

* జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ కాకినాడ పార్లమెంట్ టిడిపి ఇంఛార్జ్ జ్యోతుల నవీన్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు.