DailyDose

మోడీ క్యాబినెట్‌లోకి వైకాపా వెళ్లట్లేదు-తాజావార్తలు

మోడీ క్యాబినెట్‌లోకి వైకాపా వెళ్లట్లేదు-తాజావార్తలు

* రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల్లో ఖాళీ పోస్టులకు జిల్లాలవారీగా నోటిఫికేషన్లు విడుదల చేసి ప్రభుత్వం భర్తీ చేస్తోంది. 5,905 పోస్టుల భర్తీకి దశలవారీగా దరఖాస్తులను ఆహ్వానించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీల ద్వారా భర్తీ ప్రక్రియను చేపట్టారు. ప్రధానంగా అంగన్‌వాడీలు, మినీ అంగన్‌వాడీల్లో వర్కర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీ జరుగుతోంది. అభ్యర్థుల సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజన్‌లలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ నిధులు విడుదల చేసిన నేపథ్యంలో పోస్టుల భర్తీకి పటిష్ట చర్యలు చేపట్టారు. 4,007 అంగన్‌వాడీ హెల్పర్లు, 430 మినీ అంగన్‌వాడీ వర్కర్లు, 1,468 మెయిన్‌ అంగన్‌వాడీల్లో వర్కర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పోస్టులను భర్తీ చేయగా మరికొన్ని చోట్ల నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. 

* ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశం కొద్దిసేపటి కిందట ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, కరోనా పరిస్థితులు, విభజన హామీలు, రాష్ట్రానికి అందాల్సిన నిధులు, బకాయిలు వంటి అంశాలపై సీఎం జగన్ ప్రధాని మోదీతో చర్చించారు.మొత్తం 17 అంశాలను జగన్ ప్రధానికి నివేదించారు. ప్రత్యేకంగా, జీఎస్టీ చెల్లింపులు, రాష్ట్ర విభజన హామీలపై ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టు నిధులు, దిశ సహా కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న ఏపీ బిల్లులపైనా ఆయన ప్రధానికి తెలియజేశారు. దాదాపు సీఎం జగన్ ప్రతిపాదనలన్నింటికీ ప్రధాని మోదీ నుంచి సానుకూల స్పందన వచ్చిందని సమాచారం.కాగా, ఈసారి సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై భారీ ఎత్తున ప్రచారం జరిగింది. ఎన్డీయేలో చేరుతున్నారని, కేబినెట్ మంత్రి పదవుల బేరం కోసమని ఊహాగానాలు జోరుగా సాగాయి. అయితే, అలాంటిదేమీ లేదని వెల్లడైంది.

* దసరా దీపావళి పండుగల నేపథ్యం లో మాకు 17 రైలు కావాలి అనే దక్షిణ మధ్య రైల్వే రైల్వే బోర్డు కు పంపిన ప్రతిపాదనలు సాకారం కానున్నాయి.

* ఏ.పి.లో 24 గంటల్లో 5,795 కొత్తగా కేసులు నమెుదు, దింతొ 7,29,307 చెరిన కేసులు, రాష్ట్రంలో 24 గంటల్లో 33 మంది మరణించగ, రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,052 మంది మరణించారువిశాఖ జిల్లాలో 24 గంటల్లో 4 గురు మరణించగ కోత్తగా 303 కేసులు నమెుదు, దింతో జిల్లాలో 51,490 చెరిన కేసులు,ఇప్పటివరకు జిల్లాలో 455 మంది మరణించారుతుర్పుగోదావరి జిల్లాలో 24 గంటల్లో 4 గురు మరణించగ, 801 కేసులు నమెుదు,దింతో జిల్లాలో 1,02,439 చెరిన కెసులు,ఇప్పటివరకు 548 జిల్లాలో మంది మరణించారు

* మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డికి మరో షాక్ తగిలింది.!ఇప్పటికే పలు కేసులు నమోదుచేయగా తాజాగా ప్రభాకర్‌పై మరో కేసు నమోదయ్యింది.కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ జేసీపై తాడిపత్రి పీఎస్‌లో కేసు నమోదయ్యింది.జేసీ ప్రభాకర్‌రెడ్డి, తనయుడు అస్మిత్‌రెడ్డితో పాటు 32 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.హైదరాబాద్‌లో కరోనా చికిత్స తీసుకున్న జేసీ సోమవారం నాడు తాడిపత్రికి చేరుకున్నారు.అయితే.. జేసీ ప్రభాకర్‌రెడ్డికి భారీ ర్యాలీతో కార్యకర్తలు, అనుచరులు స్వాగతం పలికారు.కోవిడ్ నిబంధనల ప్రకారం ఇలా చేయకూడదని ఇది నిబంధనలు ఉల్లంఘించినట్లేనని పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే ఈ కేసు విషయమై జేసీ బ్రదర్స్ కానీ.. అస్మిత్ రెడ్డి కానీ స్పందించలేదు.కాగా.. జేసీ ప్రభాకర్‌పై ఇప్పటికే ఏపీలో పలుచోట్లు కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజుల పాటు కడప సెంట్రల్ జైల్‌లో కూడా ఉన్న విషయం విదితమే.

* భౌతిక శాస్త్రంలో 2020కి గాను నోబెల్ ​బహుమతిని ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రకటించింది రాయల్ స్వీడిష్ అకాడమి.ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయానికి చెందిన రోజర్​ పెన్​రోస్​ తో పాటు రీన్​హార్డ్ గెంజెల్​, ఆండ్రియా ఘెజ్​కు సంయుక్తంగా ఇస్తున్నట్లు వెల్లడించింది.కృష్ణబిలాలపై చేసిన పరిశోధనలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందిస్తున్నట్లు తెలిపింది.

* తెలుగు రాష్ట్రాల జలవివాదాలపై చర్చించేందుకు సమావేశమైన అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ ముగిసింది. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ సీఎం జగన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డు ఛైర్మన్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో గజేంద్రసింగ్‌ షెకావత్‌ మాట్లాడారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై నిర్ణయాధికారం కేంద్రానిదే అని షెకావత్ తెలిపారు. దాన్ని కేంద్రం త్వరలోనే నిర్ణయిస్తుందని వెల్లడించారు.

* తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎంసెట్‌-2020 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జేఎన్‌టీయూహెచ్‌లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేశారు. ఎంసెట్ ఇంజినీరింగ్‌లో 75.29 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వివరించారు. మొత్తంగా పరీక్షకు 1,19,183 మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 89,734 మంది ఉత్తీర్ణులైనట్లు మంత్రి వెల్లడించారు.

* హాథ్రస్‌ ఘటన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. 19ఏళ్ల యువతి మృగాళ్ల అకృత్యానికి బలైతే దేశ ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని దుయ్యబట్టారు. నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్‌లో ‘ఖేటీ బచావో యాత్ర’ నిర్వహిస్తున్న రాహుల్‌.. మంగళవారం పాటియాలాలో ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా హాథ్రస్‌ ఘటన గురించి ప్రస్తావించారు.

* ఆంగ్ల మాధ్యమం అంశంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండటం చాలా ముఖ్యమని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. చిన్నారులకు పునాది బాల్యం.. ఆ స్థాయిలో మాతృభాషలో విద్య ఉండాలని ధర్మాసనం పేర్కొంది.

* దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ తయారు చేసిన విటార బ్రెజా 5.5లక్షల కార్ల మార్కును దాటింది. మార్కెట్లోకి విడుదలైన 4.5 సంవత్సరాల్లోనే ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. ఈ కాంపాక్ట్‌ ఎస్‌యూవీని 2016 మొదట్లో మార్కెట్లోకి విడుదల చేశారు. బీఎస్‌-6 నిబంధనలు అమల్లోకి రావడంతో మారుతీ 4 సిలిండర్‌, 1.5లీటర్‌ మోడల్‌, కే సిరీస్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో కారును మార్కెట్లోకి తెచ్చింది. కేవలం ఈ ఆరునెలల కాలంలో మొత్తం 32 వేల యూనిట్లను విక్రయించింది.

* బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన బరిలోకి దిగడం లాంఛనమైంది. బిహార్‌లో సమస్యలే లేవనుకుంటే.. అక్కడ ఏయే సమస్యలున్నాయో పార్సిల్‌ ద్వారా పంపిస్తామని ఇప్పటికే చెప్పిన ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌.. తాజా ఎన్నికల్లో కనీసం 30 నుంచి 40 స్థానాల్లో పోటీ చేసే అవకాశమున్నట్లు తెలిపారు. దీనిపై మరో రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. బిహార్‌లో తాము కనీసం 50 స్థానాల్లో బరిలోకి దిగాలని పార్టీ నేతలు కోరుకుంటున్నారని అయితే దీనిపై అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సంజయ్‌ చెప్పారు.

* రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై జనవరిలో శాసనమండలిలో జరిగిన చర్చలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈనెల 9వ తేదీ నాటికి పూర్తి వివరాలు, సీడీలు సీల్డు కవర్‌లో న్యాయస్థానానికి అందజేయాలని స్పష్టం చేసింది. అమరావతికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో ఇవాళ్టి నుంచి రోజు వారీ విచారణ ప్రారంభమైంది. మొదటి రోజు 15 పిటిషన్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అన్ని కేసులపై స్టేటస్‌ కో కొనసాగుతుందని ధర్మాసనం వెల్లడించింది.

* హాథ్రస్‌ అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో అంతర్జాతీయ సంస్థల ప్రమేయంపై ఆరా మొదలైంది. ‘కుల ఆధారిత హింసను ప్రేరేపించడానికి కొన్ని సంస్థల నుంచి నిధులు సమకూర్చడం’ వంటి ఆరోపణలు రావడంతో ఆ కోణంలో దర్యాప్తు చేయడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలోకి దిగింది. ఆ దర్యాప్తు సంస్థ సన్నిహిత వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం..ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించిన ఆరోపణలను ఈడీ పరిశీలిస్తోందని, దర్యాప్తు చేసి, మనీ లాండరింగ్ కేసు నమోదుచేయొచ్చని వారు తెలిపారు.

* కొవిడ్‌-19 పరిస్థితుల దృష్ట్యా కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో సందడి మొదలయింది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు మొబైల్‌ కంపెనీలు పోటాపోటీగా కొత్త మోడళ్లను తీసుకొస్తున్నాయి. తాజాగా శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌20 సిరీస్‌లో ఫాన్య్‌ ఎడిషన్‌ (ఎఫ్‌ఈ) విడుదలచేస్తే పొకో సీ3 బడ్జెట్‌ ఫోన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మరి ఈ మోడళ్లలో ఎలాంటి ఫీచర్స్‌ ఉన్నాయి..వాటి ధరెంత..ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి

* గ్రేటర్ హైదరాబాద్‌కు తాగునీరు అందించే కేశవాపురం రిజర్వాయర్‌కి సీఎం కేసీఆర్‌ త్వరలోనే శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్‌లో జలమండలి అధికారులతో ఆయన సమావేశమయ్యారు. కేశవాపురం ప్రాజెక్టు పూర్తయితే 2050 సంవత్సరం వరకు హైదరాబాద్‌కు తాగునీటి కొరత ఉండదన్నారు. ఈ రిజర్వాయర్‌కి సంబంధించి ఇప్పటికే మొదటి దశ అటవీశాఖ అనుమతులు లభించిన నేపథ్యంలో తదుపరి అనుమతుల కోసం మరింత వేగంగా ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా నీటి కొరత లేకుండా చేయాలంటూ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని రకాలుగా సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. అధికారులు ఆ దిశగా పనులు చేయాలని కేటీఆర్‌ సూచించారు.

* ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా మహమ్మారికి కారణమైన చైనా తాజాగా వ్యాక్సిన్‌ తయారీలో దూసుకెళ్తోంది. ఇప్పటికే చైనా తయారుచేసిన వ్యాక్సిన్‌లు మూడోదశ ప్రయోగాలకు చేరుకొన్నాయి. తాజాగా వీటిని అత్యవసర వినియోగ జాబితాలో చేర్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థతో సంప్రదింపులు జరుపుతోంది. వ్యాక్సిన్‌ అంతర్జాతీయంగా అందుబాటులోకి తేవడంలో భాగంగా తాజా చర్చలు ఓ ముందడుగు అని వ్హో అభిప్రాయపడింది.

* బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన బరిలోకి దిగడం లాంఛనమైంది. బిహార్‌లో సమస్యలే లేవనుకుంటే.. అక్కడ ఏయే సమస్యలున్నాయో పార్సిల్‌ ద్వారా పంపిస్తామని ఇప్పటికే చెప్పిన ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌.. తాజా ఎన్నికల్లో కనీసం 30 నుంచి 40 స్థానాల్లో పోటీ చేసే అవకాశమున్నట్లు తెలిపారు. దీనిపై మరో రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. బిహార్‌లో తాము కనీసం 50 స్థానాల్లో బరిలోకి దిగాలని పార్టీ నేతలు కోరుకుంటున్నారని అయితే దీనిపై అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సంజయ్‌ చెప్పారు.

* హాథ్రస్‌ అత్యాచార ఘటనలో బాధిత కుటుంబానికి భద్రత కల్పించకపోవడంపై శివసేన పార్టీ విమర్శలు గుప్పించింది. ముంబయికి చెందిన ఓ కథానాయికకు ‘వై-ప్లస్‌’ భద్రత కల్పించిన కేంద్రం.. బెదిరింపులు ఎదుర్కొంటున్న బాధిత దళిత కుటుంబానికి ఎందుకు రక్షణ ఇవ్వట్లేదని ప్రశ్నించింది. ఈ మేరకు తమ అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది.

* పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ బిహార్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. మహాకూటమి నుంచి వికాస్‌ శీల్‌ ఇన్సాన్‌ పార్టీ (వీఐపీ) వైదొలగడం, అధికార ఎన్‌డీఏ నుంచి ఎల్‌జేపీ బయటకు రావడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వీఐపీ వైదొలగడాన్ని పక్కనపెడితే ఎన్‌డీఏలో కీలకంగా మారిన ఎల్‌జేపీ బయటకు రావడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. మరోవైపు జేడీయూ విధివిధానాలు నచ్చకే ఎన్‌డీఏతో తెగతెంపులు చేసుకున్నట్లు చెబుతున్న ఎల్‌జేపీ అధ్యక్షుడు చిరాగ్‌ పాసవాన్‌, భాజపాతో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తమకు అనుకూలంగా లేని స్థానాల్లో సీట్లు కేటాయించినా కాషాయపార్టీని పల్లెత్తు మాట కూడా అనలేదు. దీనిని బట్టి భవిష్యత్‌లో ఊహించని రాజకీయ పరిణామాలేమైనా చోటు చేసుకుంటే ఎల్‌జేపీ తిరిగి భాజాపాతో అడుగులు వేసే అవకాశముందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

* మాన్సాస్‌ ట్రస్టు ఆధ్వర్యంలోని మహారాజా(ఎంఆర్‌) కళాశాల ప్రైవేటీకరణ వ్యవహారంపై పూసపాటి వంశీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పూసపాటి వంశీయులు రోజుకొకరు మీడియా ముందు తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎంఆర్‌ కళాశాల వ్యవహారంపై ఆనంద గజపతిరాజు మరో కుమార్తె పూసపాటి ఊర్మిళ గజపతి మీడియాతో మాట్లాడారు. మాన్సాస్‌ ట్రస్ట్‌ వ్యవహారంపై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిసేందుకు ఆయన అపాయింట్‌మెంట్‌ కోసం సంవత్సరం నుంచి ప్రయత్నిస్తున్నా దొరకడం లేదని చెప్పారు.

* మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. దుబ్బాకలో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడారు. తెలంగాణలో ఆదర్శ నాయకుడు చెరుకు ముత్యం రెడ్డి అని.. కాంగ్రెస్‌ పార్టీలో ఆయన కుమారుడు శ్రీనివాస్‌ రెడ్డి చేరికను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఆయనకు మంచి రాజకీయ భవిష్యత్‌ ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయని.. ప్రజల నుంచి దోచుకున్న సొమ్ముతోనే డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు.

* కర్నూలు జిల్లాలో ఓ ప్రైవేటు సంస్థకు చెందిన భూములను తప్పుడు పత్రాలు సమర్పించి తన బంధువులు, బినామీల పేరిట మంత్రి జయరాం రాయించుకున్నారని తెదేపా సీనియర్‌నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. విశాఖలోని తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆ సంస్థ నుంచి 2009లోనే బయటకొచ్చిన మంజునాథ్‌ అనే వ్యక్తి తప్పుడు పవర్‌ ఆఫ్‌ అటార్నీ పత్రాలు సమర్పించి వందల ఎకరాల భూమిని అతని పేరుమీద, ఆ తర్వాత మంత్రి బంధువులకు విక్రయించారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.