Business

₹20నాణెలు చూశారా?

₹20నాణెలు చూశారా?

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవల విడుదల చేసిన రూ. 20 నాణేలను విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణం గవరపాలెంకు చెందిన ఆళ్ల సంతోశ్‌కుమార్‌ సేకరించారు. కొత్తగా ముద్రించిన ఈ నాణేలను ఆర్‌బీఐ గతనెలలో పరిమిత సంఖ్యలో విడుదల చేయగా దిల్లీలోని కాయిన్‌ కలెక్టర్లు వీటిని దక్కించుకున్నారు. వారి వద్ద వీటిని కొనుగోలు చేసినట్లు సంతోశ్‌కుమార్‌ తెలిపారు. ఆర్‌బీఐ విడుదల చేసిన అన్ని రకాల నాణేలతోపాటు నోట్లు సేకరించడం తన అభిరుచి అని ఆయన చెప్పారు