Food

బ్రౌన్ బియ్యం భలే భలే

బ్రౌన్ బియ్యం భలే భలే

సమయానికి..సరైన ఆహారం తీసుకోక పోవడంతో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇందులో భాగంగానే కొందరు వేలా పాలా లేకుండా ఫుడ్ తీసుకోవడంతో వెయిట్ కూడా పెరుగుతుంటారు. వెట్ సమస్యతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. బరువు తగ్గేందుకు నానా పాట్లు పడుతున్నారు. దీనికి బ్రౌన్ రైస్ తో చెక్ పెట్టవచ్చంటున్నారు నిపుణులు. అంతేకాదు ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయంటున్నారు. బ్రౌన్ రైస్ లో తక్కువ ఫ్యాటెనింగ్ పదార్థాలుంటాయి.
1.డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది:
డయాబెటిస్ అనేది సాధారణ మెటబాలిక్ డిజార్డర్. ఈ మధ్యకాలంలో, ఈ డిజార్డర్ కు గురయ్యేవారి సంఖ్య పెరుగుతూ ఉంటోంది. ఇన్సులిన్ అనే హార్మోన్ ని శరీరం తగినంతగా ఉత్పత్తి చేయకపోతే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి అమాంతం పెరుగుతాయి. దీంతో.. అనేక అవాంఛిత ప్రభావాలు శరీరంపై పడతాయి. బ్రౌన్ రైస్ అనేది ఫైటిక్ యాసిడ్, ఫైబర్ లనే న్యూట్రియెంట్స్ ని పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని సమర్థవంతంగా తగ్గించి డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. అందువలన, డయాబెటిస్ వలన కలిగే దుష్ప్రభావాలు తగ్గుతాయి.
2.సిస్టమ్ ని డిటాక్సిఫై చేస్తుంది:
అనారోగ్యకరమైన ఆహారాల ద్వారా మన శరీరంలోకి టాక్సిన్స్ అనేవి ఎక్కువసంఖ్యలో పేరుకుపోతూ ఉంటాయి. ఈ ప్రక్రియ రోజువారీ జరుగుతుంది. పొల్యూటెంట్స్, వాతావరణంలోని జెర్మ్స్ వంటివి కూడా ఈ ప్రక్రియను ప్రోత్సహిస్తున్నాయి. అందుకే శరీరాన్ని ఇంటర్నల్ గా డిటాక్సిఫై చేసుకోవడం తప్పనిసరి.దీంతో అనేక వ్యాధులను అరికట్టవచ్చు. బ్రౌన్ రైస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి సిస్టమ్ ని సహజంగా డిటాక్సిఫై చేస్తాయి. టాక్సిన్స్ ను తొలగిస్తాయి.
3.గుండె వ్యాధులను అరికడుతుంది.
గుండె వ్యాధుల ద్వారా ప్రాణాలను కోల్పోయే వారి సంఖ్య పెరుగుతోంది. శరీరంలోని ముఖ్య అవయవాలను దెబ్బతీసే వ్యాధులు ప్రాణాంతకమైనవి. వీటి నుంచి రక్షణ పొందటం అంత సులువు కాదు. బ్రౌన్ రైస్ లో లభించే ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లకి ఆర్టరీస్ లో పేరుకున్న ప్లేగ్ ను తొలగించే సామర్థ్యం ఉంది.దీంతో గుండెకి రక్తసరఫరా మెరుగ్గా జరుగుతుంది. ఆ విధంగా..గుండె జబ్బులను అరికట్టవచ్చు.
4.న్యూ మదర్స్ లో లాక్టేషన్ ని పెంపొందిస్తుంది.
ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన తల్లులు తమ ఆరోగ్యాన్ని రికవర్ చేసుకుంటే బిడ్డకి తగినంత పోషణ వారి పాల ద్వారా లభిస్తుంది. బ్రౌన్ రైస్ అనేది నర్సింగ్ మదర్స్ లో బ్రెస్ట్ మిల్క్ ఉత్పత్తిని పెంపొందిస్తుంది. నర్సింగ్ మదర్స్ లోని మిల్క్ గ్లాండ్స్ ని ప్రేరేపించడం ద్వారా శిశువు పోషణకి అవసరమైన బ్రెస్ట్ మిల్క్ ని అందిస్తుంది.
5.జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
హెల్తీ డైట్ ను పాటించడానికి కూడా తీరిక లేని బిజీ షెడ్యూల్స్ లో ఉన్నవారు అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం ద్వారా వివిధ జీర్ణసమస్యలతో సతమతమవుతూ ఉంటారు. గాస్త్రైటిస్, బ్లోటింగ్, ఎసిడిటీ, కాన్స్టిపేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. బ్రౌన్ రైస్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా లభిస్తుంది. ఇది డైజెస్టివ్ జ్యూస్ లను రేగులేట్ చేసి స్టూల్ ను స్మూత్ చేస్తుంది.
6.హై కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
చాలా మంది హై కొలెస్ట్రాల్ తో బాధ పడుతున్నామని చెబుతుంటారు. ఈ సమస్య అత్యంత సాధారణ సమస్యగా మారిపోయింది. వివిధ కారణాలవలన శరీరంలోని అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగినప్పుడు ఆర్టెరీస్ లో కొలెస్ట్రాల్ పేర్కొని వివిధ అవయవాలను రక్తప్రసరణని అడ్డుకుంటాయి. బ్రౌన్ రైస్ లో హై కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణం ఉంది. బ్రౌన్ రైస్ లో లభించే గామా ఎమినోబ్యుటిరిక్ యాసిడ్ (GABA).
7.క్యాన్సర్ ను అరికడుతుంది.
క్యాన్సర్ అనే ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేకమంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఏజ్ తో అలాగే జెండర్ తో సంబంధం లేకుండా ప్రతి ఏడాది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. శరీరంలోని క్యాన్సర్ కారక కణాలు వృద్ధి చెందుతున్నప్పుడు అవి శరీరంలోని అవయవాలను అలాగే టిష్యూలను డిస్ట్రాయ్ చేస్తాయి. బ్రౌన్ రైస్ లో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ వలన క్యాన్సర్ కారక కణాల వృద్ధి అరికట్టబడుతుంది.
8.డిప్రెషన్ ను తగ్గిస్తుంది.
డిప్రెషన్ వంటి వివిధ మానసిక సమస్యలను తొలగించే సామర్థ్యం కలిగిన సహజసిద్ధమైన ఇంగ్రిడియెంట్స్ లో బ్రౌన్ రైస్ ముఖ్య స్థానాన్ని కైవసం చేసుకుంది. గ్లుటామైన్, గ్లిజరిన్ మరియు GABA వంటి కొన్ని ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ లు బ్రౌన్ రైస్ లో లభించడం వలన ఈ ఆరోగ్య ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇవి మెదడులోని సిరోటినిన్ ఉత్పత్తిని మెరుగుపరచి మెదడులోని యాంగ్జైటీ అలాగే డిప్రెషన్ కు సంబంధించిన లక్షణాలను తగ్గిస్తుంది.
9.బోన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.
ఎమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఎసెన్షియల్ న్యూట్రియెంట్స్, మెగ్నీషియం, కేల్షియం వంటి మినరల్స్ బ్రౌన్ రైస్ లో సమృద్ధిగా లభిస్తాయి. ఇవి బోన్స్ ని హెల్తీగా అలాగే స్ట్రాంగ్ గా ఉంచేందుకు తోడ్పడతాయి. వయసు మీదపడుతున్నా కూడా బోన్స్ ఆరోగ్యాన్ని కాపాడటంలో బ్రౌన్ రైస్ తనదైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి, బోన్స్ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రెగ్యులర్ బేసిస్ లో బ్రౌన్ రైస్ ను తీసుకోండి. దీంతో ఆస్టియోపొరోసిస్ వంటి వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.