Fashion

హిందువుల శుభకార్యాల్లో స్వస్తిక్ ఎందుకు రాస్తారు?

Hindu Lifestyle - Why do you write swastika in festival times?

మంచి పనులు, శుభాకార్యాలు మొదలుపెట్టి వాటిని పేపర్‌పై రాస్తున్నప్పుడు ఓంకారంతో పాటు స్వస్తిక్‌ని కూడా రాస్తారు.. ఇలా చేయడం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకోండి.. శుభకార్యాల్లో స్వస్తిక్ రాయడం వెనుక అర్థం ఇదే.భారత సాంప్రదాయంలో ఏవైనా శుభకార్యాలు మొదలుపెట్టినప్పుడు వాటిని పత్రికల రూపంలో రాస్తుంటారు. అలాంటి సందర్భాల్లో ఓంకారంతో పాటు స్వస్తిక్‌ని కూడా రాయడం మనం గమనిస్తుంటాం.. ఇలా ఎందుకు రాస్తారంటే.. సవ్యదిశగా చేస ప్రయాణంలో గమ్యస్థానం ఎప్పుడూ కూడా ఉత్తరం అవుతుంది. ఉత్తరం అంటే ఉన్నదానికన్నా శ్రేష్ఠమైనది, మేలైనది అని అర్థం. ఈ గుర్తు శ్రేయోదాయకమైన గమనాన్ని సూచిస్తుంది.అదే విధంగా సూర్యుడికి గుర్తుగా కూడా స్వస్తిక్ గుర్తును సూచిస్తారు. సూర్యభగవానుడు వెలుగు, విద్య, జ్ఞానం మొదలైన వాటికి ప్రతీక. అందువల్ల స్వస్తిక్ గుర్తు కూడా శుభసూచకమని పెద్దలు అభిప్రయాపడతారు.అందుకే పూర్ణకుంభం, ఓంకారం ఎలాంటి మహత్తుని కలిగి ఉంటాయో స్వస్తిక్ కూడా అంతటి విశిష్టత ఉందని.. స్వస్తి కలిగించేదే స్వస్తిక్ అని శుభాకార్యాల్లో ఈ గుర్తును పెడతారు.ఈ మధ్యకాలంలో ఇంటి నిర్మాణంలో, దేవుడి గదిలో, తలుపులకి కూడా ఈ గుర్తుని వాడతారు.