DailyDose

ఎమ్మెల్యేకు బెదిరింపులు-నేరవార్తలు

ఎమ్మెల్యేకు బెదిరింపులు-నేరవార్తలు

* మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలొ తెలంగాణ రెవిన్యూ చట్టానికి మద్దతుగా తెరాస తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీలో ట్రాక్టర్ బోల్తా పడి ఒక వ్యక్తి మృతి.ఊరుకొండ మండలం జగబోయింపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ మిడ్జిల్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడ్డ దృశ్యం.

* చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కు నకిలీ ఎసిబి బెదిరింపులు. ఏసీబీ డీఎస్పీ నంటూ చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు పీఏకు హరికృష్ణ అనే మాయగాడి ఫోన్. చిత్తూరులో వీఐపీల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు చేస్తున్నామని ఫోన్ చేసిన మాయగాడు. తనని తాను ఏసీబీ డీఎస్పీ హరిగా పరిచయం చేసుకున్నాడు. తాము దాడుచేస్తూ ఉన్నఫలంగా వచ్చి చిత్తూరులో ఒక లాడ్జ్ లో ఉన్నామని తమ దగ్గర ఏటీఎం కార్డులు మాత్రమే ఉన్నాయని ఖర్చులకు డబ్బులు పంపాలని కోరిన హరికృష్ణ. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే పీఏ. అర్ధరాత్రి లాడ్జ్ లో నకిలీ ఏసీబీ అధికారి హరికృష్ణను అదుపులోకి తీసుకున్న చిత్తూరు పోలీసులు. పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారులు, ఉద్యోగులకు కూడ పలువురికి హరికృష్ణ ఫోన్ చేసినట్లు సమాచారం.

* విశాఖ బర్మాకాంప్ లో స్కూల్ ను సచివాలయంగా మార్చడాన్ని నిరసిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. పిల్లలు పాఠశాల ముద్దు, మాకు ఏ ఆఫీసులు వద్దు అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ విశాఖ ఉత్తర నియోజకవర్గం 49వ వార్డులో సరస్వతి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలోపురాతనమైన స్కూల్ ఉండేదని చెప్పారు. కార్పొరేషన్ వారికి చెప్పినా నిధులు లేవని పట్టించుకోలేదని వాల్తేర్ రౌండ్ టేబుల్, సీఎం ఆర్, తదితర సంస్థలు 45 లక్షల రూపాయలతో పాఠశాలను ఆధునీకరించిందన్నారు. ఆ స్కూల్ భవనాన్ని సచివాలయంగా మార్చుతామని చెప్పడం సరికాదన్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య దీవెన పెట్టి స్కూల్ తీసుకోవడం విడ్డురంగా ఉందని అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే స్థానికులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారుబీజేపీ నేత గంకల అప్పారావు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందన్నారు. పాఠశాలను సచివాలయంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.

* శంషాబాద్ ఔటర్ రింగ్గురోడ్డుపై కారు బీభత్సం ఒకరికి తీవ్రగాయాలు హస్టల్ కు తరలింపు .శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తోండుపల్లి ఔటర్ రింగ్గురోడ్డుపై హోండా కారు బీభత్సం సృష్ఠించింది .గచ్చిబౌలి ఔటర్ రింగ్గురోడ్డు పై నుండి శంషాబాద్ వైపు వస్తుండగా తోండుపల్లి వద్దకు రాగానే కారు అదుపు తప్పి పల్టీ కొడుతూ డివైడర్ ను డికొట్టింది.ఈ ప్రమాదంలో చారి అనే వ్యక్తికి గాయాలు ప్రవేట్ హస్పటల్ కు తరలించిన పొలీసులు.