Health

ఈ పట్టీ చర్మ క్యాన్సర్‌ను చంపుతుంది

Bandage That Kills Skin Cancer - Telugu Health News

చర్మకేన్సర్ కణాలను వేడితో చంపేసే ‘అయస్కాంత నానోఫైబర్స్‌’తో కూడిన బ్యాం డేజ్‌ను ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌(ఐఐఎ్‌స సీ బెంగళూరు) శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేశారు. సూర్యు డి అతినీల లోహిత కిరణాలకు గురయ్యేవారికి చర్మ కేన్సర్‌ ముప్పు ఎక్కువ. చర్మ కేన్సర్‌లు రెండు రకాలు. ఒకటి.. మెలనోమా. రెండోది నాన్‌-మెలనోమా. వీటిలో మెలనోమా ప్రాణాంతక కేన్సర్‌. మెలనోమా సోకిన వారిలో మరణాల రేటు ఎక్కువ. శస్త్రచికిత్స, రేడియేషన్‌, కీమోథెరపీలకు పరిమితులున్నాయి. ఈ క్రమంలోనే మాగ్నెటిక్‌ హైపర్‌థెర్మియా అనే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఈ చికిత్సలో కేన్సర్‌ కణాలపై వేడి ఒకేలా ప్రసరించదు. ఆ సమస్యను పరిష్కారించేలా ఐఐఎ్‌ససీలోని ‘సెంటర్‌ ఫర్‌ బయోసిస్టమ్స్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌(బీఎ్‌సఎ్‌స ఈ), ‘మాలిక్యులార్‌ రీప్రొడక్షన్‌, డెవల్‌పమెంట్‌ అండ్‌ జెనెటిక్స్‌(ఎంఆర్‌డీజీ)’ విభాగాల శాస్త్రజ్ఞులు ఎలకో్ట్రస్పిన్నింగ్‌ విధానంలో పనిచేసే కొత్త బ్యాండేజ్‌ను తయారుచేశారు. మానవుల్లోని కేన్సర్‌ కణాలపై ఇన్‌విట్రో పద్ధతిలో, ఎలుకల్లోని కేన్సర్‌ కణాలపై ఇన్‌ వివో పద్ధతిలో చేసిన ప్రయోగాల్లో బ్యాండేజ్‌ వల్ల జనించిన వేడి కేన్సర్‌ కణాలను విజయవంతంగా నిర్మూలించిందని శాస్త్రజ్ఞులు తెలిపారు. అయితే, దీని సామర్థ్యాన్ని పరీక్షించేందుకు మరిన్ని అధ్యయనాలు, ఎలుకలు, కుక్కలు, కోతులపై పెద్ద ఎత్తున ప్రయోగాలు జరగాల్సి ఉందని ఐఐఎ్‌ససీ శాస్త్రజ్ఞులు అన్నారు.