DailyDose

పుష్కరిణిలో చేపల కంపు-నేరవార్తలు

Crime News - Pushkarini Being Used For Fish Farming

* విశాఖ జిల్లా చోడవరంలో ప్రసిద్ధి చెందిన స్వయంభూ గంగా సమేత గౌరీశ్వరుని సన్నిధిలోని పుష్కరిణిలో చనిపోయిన చేపల కంపుతో భక్తులు ఇబ్బందులు పడటం చర్చనీయాంశం గా మారింది. దేవదాయ శాఖ అధికారులు ఇటీవల పుష్కరిణీలో చేపలకుగాను వేలం పాట నిర్వహించారు. ఈ పాట ద్వారా రూ.93 వేల మేర ఆదాయం వచ్చింది. పాట పాడుకున్న మత్స్య కారుడు చేపల పెంపకానికి గాను వేసే ఆహారపదార్థాలు, మందులు వల్ల పుష్కరిణి బాగా కలుషితమైపోయింది. గొర్రలు రకానికి చెందిన చేపలకు మార్కెట్ లో ధర తక్కువ గా ఉండటం తో ఇవి మిగిలిన చేపలను తినేస్తాయని తెలియడంతో ఆదాయం ఎక్కువగా వచ్చే చేపలను రక్షించుకునేందుకు మందులు వేసి చంపేస్తున్నట్లు స్థానిక ప్రజానీకం ఆరోపిస్తున్నారు. పవిత్రమైన పుష్కరిణిని ఇలా అవిపత్రం చేసే చర్యలపై దేవదాయ శాఖ చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఏడాది పాటు పుష్కరిణిలో చేపల పెంపకానికి ఇచ్చిన లీజు అగ్రిమెంట్ లో ఎటువంటి రసాయనాలు,వ్యర్ధ పదార్థాలు కలుపరాదని నిబంధన వుంది. ఈ విషయంలో స్థానిక ప్రజానీకం, భక్త జనం మాత్రం దేవాదాయశాఖ అధికారుల నిర్ణయం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు…….ఎంతో ప్రసిద్ధిగాంచిన స్వయంభూ గంగా సమేత గౌరీశ్వర స్వామి దేవాలయం లో జరిగే అభిషేకాలు,పూజా ద్రవ్యాలు ఈ పుష్కరిణిలో నే కలుస్తాయని…..అలాంటి పవిత్ర పుష్కరిణిని చేపల పెంపకానికి వేలం పాట ఏర్పాటు చేయడం.

* నాటుసారాను విడనాడటం శాశ్వత పరిష్కారం కావాలి- గిలకలదిండి గ్రామంలో నిర్వహించిన పరివర్తన కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్. ఈరోజు బందరు మండలం గిలకలిదిండి గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో పరివర్తన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ASP వకుల్ జిందల్ IPS., బందరు ఆర్డిఓ NSK ఖాజావలి , బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీ దుర్గ , బందరు డీఎస్పీ మహబూబ్ బాషా ఇతర పోలీసు అధికారులు హాజరయ్యారు.

* గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం భట్లూరులో పోలీసుల సోదాలు.అక్రమంగా నిల్వచేసిన 75 మద్యం టెట్రా ప్యాకెట్ల స్వాధీనం.కర్ణాటక నుంచి తెచ్చి మద్యం ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తింపు.ఒకరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న పోలీసులు.

* బాబు అక్రమాస్తుల కేసును ఈ నెల 21 కి వాయిదా వేసిన ఆఛ్భ్ కోర్ట్-2004 ఎన్నికల అఫిడవిట్ లో చంద్రబాబు చూపిన ఆస్తులు పై ఏసీబీ కి ఫిర్యాదు చేసిన లక్ష్మీ పార్వతి-1987 నుండి 2005 వరకు చంద్రబాబు అక్రమంగా తన వ్యక్తి గత ఆస్తులను పెంచుకున్నడంటు లక్ష్మీ పార్వతి ఏసీబీ కి ఫిర్యాదు-ఏసీబీ కేసు కొనసాగుతున్న నేపథ్యంలో 2005 లో హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్న చంద్రబాబు-ఇటీవలే వెకెట్ అయిన చంద్ర బాబు స్టే-నేతల కేసుల విచారణ లో భాగంగా మళ్ళీ తెరమీదకు వచ్చిన బాబు అక్రమాస్తుల కేసుప్రజాప్రతినిధుల కేసుల విచారణలో భాగంగా ముమ్మరం కానున్న దర్యాప్తు-తదుపరి విచారణను వచ్చే నెల 21 కు వాయిదా వేసింది ఏసీబీ కోర్ట్

* తెలంగాణలో దళిత మహిళలపై, మైనర్ బాలికపై జరుగుతున్న దాడులకు నిరసనగా మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను బిజెపి నేతలు దహనం చేశారు.