Movies

రష్మికా తొలి తమిళ సినిమా

రష్మికా తొలి తమిళ సినిమా

కార్తీ, రష్మికా మందన్నా జంటగా నటించిన తమిళ చిత్రం ‘సుల్తాన్‌’. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి భాగ్య రాజ్‌ కన్నన్‌ దర్శకత్వం వహించారు. యస్‌ఆర్‌ ప్రభు, యస్‌ఆర్‌ ప్రకాష్‌ నిర్మించారు. లాక్‌డౌన్‌కి ముందు ఈ సినిమా చిత్రీకరణ దాదాపు 90 శాతం పూర్తయింది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం అయింది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేశారు. తమిళంలో రష్మికకు ఇది తొలి చిత్రం. ‘సినిమా చిత్రీకరణ పూర్తయింది. మూడేళ్ల క్రితం ఈ కథ విన్నప్పటి నుంచి ఇవాళ్టి దాకా కూడా అదే ఎగ్జయిట్‌మెంట్‌తో ఉన్నాను. నిర్మాణంపరంగా నేను నటించిన పెద్ద సినిమాల్లో ఇదొకటి. సినిమా పూర్తి చేయడానికి సహకరించిన టీమ్‌ అందరికీ ధన్యవాదాలు’ అన్నారు కార్తీ.