Politics

తెదేపా నిజనిర్ధారణ కమిటీ నివేదిక అంట….

తెదేపా నిజనిర్ధారణ కమిటీ నివేదిక అంట….

ఆస్పరిలో మంత్రి గుమ్మనూరు జయరాం కొనుగోలు చేసిన ఇట్టినా కంపెనీ భూములను టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ పరిశీలించింది. కమిటీలో ఎమ్మెల్సీలు బీటెక్ రవి, బీటీ నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, కోట్ల సుజాత ఉన్నారు. ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ.. గుమ్మనూరు జయరాం రెడ్ హండెడ్‌గా దొరికిపోయాడన్నారు. నకిలీ డాక్యుమెంట్లతో మంత్రి జయరాం భూములు కొనుగోలు చేశారన్నారు. ఎన్నికల్లో రైతుల భూములు కంపెనీతో తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చి మంత్రి అయ్యాక సొంతం చేసుకున్నారని విమర్శించారు. సీఎం జగన్ రైతుకు మేలు చేస్తామని చెబుతుంటే మంత్రి జయరాం భూములు లాక్కుంటున్నారని బీటెక్ రవి పేర్కొన్నారు.