Politics

జగన్ కేసులు సోమవారానికి వాయిదా

జగన్ కేసులు సోమవారానికి వాయిదా

జగన్ కేసుల విచారణ సోమవారానికి వాయిదా

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు సంబంధించిన అన్ని అక్రమాస్తుల కేసులపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. ప్రస్తుతం సీఎం కోర్టుకు హాజరుకాలేరని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని జగన్‌ తరఫు లాయర్‌ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిని స్వీకరించిన సీబీఐ కోర్టు ఈ మేరకు వాయిదా వేసింది.

మరోవైపు సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసుపై ఈడీ ప్రత్యేక కోర్టు శుక్రవారం విచారణ ప్రారంభించింది. జగతి పబ్లికేషన్స్‌ తరపున న్యాయవాది జి.అశోక్‌రెడ్డి వాదనలు వినిపించారు. కాగా కేసును సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని.. హైకోర్టులో పిటిషన్‌ వేశామన్నారు. దీంతో ఈ కేసుపై తదుపరి విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసినట్లు ఈడీ ప్రత్యేక కోర్టు తెలిపింది. 

ప్రజాప్రతినిధులు, మాజీలపై ఉన్న కేసులపై రోజువారీ విచారణ జరపాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో.. ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసు గురువారం ఈడీ ప్రత్యేక కోర్టులో విచారణకు వచ్చింది. నిజానికి ఈ కేసులు ఈ నెల 13న విచారణకు రావాల్సి ఉంది. అయితే నేతలపై ఉన్న కేసుల విచారణను ఆయా కోర్టులు ముందుకు జరిపాయి.