DailyDose

బెజవాడలో బీహార్ సంస్కృతి.పోలీసు శాఖ ఉద్యోగి మృతి-నేరవార్తలు

బెజవాడలో బీహార్ సంస్కృతి.పోలీసు మృతి-నేరవార్తలు

* ఇప్పటికి హైదరాబాద్ కే పరిమితం అయిన కాల్పుల కల్చర్ ఇప్పుడు విజయవాడలో కూడా మొదలైంది.విజయవాడ నగర శివారులో తుపాకీ కాల్పుల కలకలం సృష్టించాయి. అర్ధరాత్రి అగంతకులు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందాడు. యువకుడిపై దుండగులు కాల్పుల జరిపి కాల్చి చంపారు. అయితే మృతుడిని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో పనిచేసే మహేష్‌గా గుర్తించారు. కాల్పుల ఘటన విజయవాడ శివారు బైపాస్‌రోడ్డులోని బార్‌ సమీపంలో చోటుచేసుకుంది. నిందితులు పథకం ప్రకారమే మహేష్‌ను హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.హత్య జరిగిన ఘటనా స్థలాన్ని సీపీ బత్తిన శ్రీనివాసులు అర్ధరాత్రి పరిశీలించారు. నిందితుల ఆచూకీ కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్ని వీలైనంత త్వరగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నగరంలో చోటు చేసకున్న ఈ ఘటనతో విజయవాడ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.మృతుడు సీపీ కార్యాలయం లో పనిచేసే అటెండర్ మహేష్ గా గుర్తించారు. అయితే కాల్పులకు రియల్ ఎస్టేట్ వివాదం కారణం అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. విజయవాడ బైపాస్ రోడ్ లోని సుబ్బారెడ్డి బార్& రెస్టారెంట్ వద్ద ఈ ఘటన జరిగింది. స్కూటీపై వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కాల్పులు జరిగే సమయంలో మృతుడు మహేష్ తో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు పరారీ అయ్యారు.

* గుంటూరు సంగడిగుంట కు చెందిన 11 మంది యువకులు ఆదివారం తెల్లవారుజామున ద్విచక్రవాహనాలపై బాపట్ల మండలం సముద్రం వరకు చేరుకున్నారు.వీరంతా తీరంలో స్నానం చేస్తుండగా అలల తాకిడికి సంతోష్, తరుణ్ గల్లంతు కాగా స్థానిక ఉన్న జాలర్లు సంతోష్ ను కాపాడి వైద్యశాలకు తరలించారు.తరుణ్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో తోటి స్నేహితులు ఆందోళనలో ఉన్నారు.

* పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి 18 కిలోల బంగారం, రూ.2.30 లక్షల నగదుతో ఉన్న వ్యక్తిని ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా ఓ పోలీస్‌ అధికారి మాట్లాడుతూ తనిఖీ సమయంలో షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌లోకి వచ్చిన ఒక వ్యక్తి, తన బ్యాగ్‌లో 18.39 కిలోల బంగారం, రూ .2.30 లక్షల నగదును తీసుకెళ్తున్నట్లు గుర్తించామన్నారు.కేసును ఆదాయపు పన్ను శాఖల అధికారులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని ఆయన చెప్పారు.

* ‘దిశ..ఎన్‌కౌంటర్‌’ సినిమా విడుదల నిలిపేయాలని హైకోర్టును ఆశ్రయించిన  దిశ తండ్రి శ్రీధర్‌రెడ్డి మరో అడుగు ముందుకేశారు.ఆదివారం ఉదయం రాంగోపాల్‌ వర్మ కార్యాలయం ఎదుట ఆయన ధర్నాకు దిగారు.ఆయన వెంట పలువురు మహిళలు, స్నేహితులు ఉన్నారు. వారంతా దిశ సినిమాను ఆపాలని డిమాండ్‌ చేస్తున్నారు.

* న‌గ‌రంలోని అమీర్‌పేట‌లో ఓ వ్య‌క్తి దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు.ధ‌రంక‌రం రోడ్డులోని ఓ అపార్టుమెంటులో చంద్ర‌శేఖ‌ర్ అనే వ్య‌క్తిని గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు హ‌త్య చేశారు.భార్య హ‌త్య‌కేసులో చంద్ర‌శేఖ‌ర్ ఇటీవ‌లే జైలు నుంచి విడుద‌య్యాడు.స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. కుటుంబ క‌ల‌హాలే హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.కేసు న‌మోదుచేసిన ఎస్సార్‌న‌గ‌ర్ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.