Food

బీరకాయతో మధుమేహం మలబద్ధకం దూరం

Diabetes & Indigestion Can Be Treated With Beerakaya

పచ్చగా నిగనిగలాడే బీరకాయల్లో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. మలబద్ధకాన్ని అడ్డుకుంటుంది. రక్తంలో చెక్కర స్థాయిల్ని తగ్గించడంలో సాయపడుతుంది. బరువును తగ్గిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచి, విషతుల్యాలను బయటకు పంపడంలో సాయపడుతుంది. వారానికి రెండుసార్లయినా వీటిని వాడమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.బీరకాయల్లోఅతి తక్కువ క్యాలరీలు ఉంటాయి. బరువును తగ్గించడంలో తిరుగులేనిది. ఇతర అధిక పీచుగల తక్కువ క్యాలరీల పదార్థాలతో కలిపి తింటుంటే వారిలో రెండు పౌండ్లు బరువు తగ్గే అవకాశం ఉంది. కడుపు నిండిన భావాన్ని ఇస్తూ తరచూ ఏదో ఒకటి తినకుండా అడ్డు పడుతుంది.
*చక్కెర వ్యాధికి మందు
బీరకాయల్లో ఉండే పెప్టిడెస్ ఇన్సులిన్ బ్లడ్ షుగర్‌ను బ్యాలెన్స్ చేసి తగ్గిస్తుంది. చక్కెర స్థాయిలు పెరగకుండా బీరకాయలు అడ్డుకుంటాయి. అలాగే సాధారణ స్థాయిలు పడిపోకుండా ఆపుతుంది. కాబట్టి డయాబెటిస్, హైపోగ్లైకేమియాతో బాధపడేవారికి ఇది మంచి ఆహారం. అందుకే డయాబెటిస్‌తో బాధపడేవారు ఎక్కువగా బీరకాయను తింటూండాలి.
*యాంటీ ఇన్‌ఫ్లమేషన్
: యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కారకంగా పనిచేయడం ద్వారా కార్డియో వాస్కులర్, స్ట్రోక్, క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి పరిరక్షిస్తుంది. ఇన్‌ఫ్లమేషన్ అనేది వ్యాధిని కలిగించడంలో తొలిదశ వంటిది.బీరకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నిమ్మరసం పిండుకుని తింటుంటే యూరినరి బ్ల్లాడర్ ఇన్‌ఫ్లమేషన్, యూరెథైటిస్ తగ్గుతాయి. దీనిలో యాంటీ బయోటిక్ లక్షణాలు కూడా వుండి బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది. ముఖ్యంగా యూరినరి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది.
*జాండీస్
కామెర్ల నుంచి కోలుకునేవారికి బీరకాయ రసం బాగా పనిచేస్తుంది. బీరకాయ గింజలు కాలేయాన్ని పరిశుభ్రపరచడానికి దోహదపడుతాయి. ఒక కప్పు తాజా బీరకాయ రసంలో కొద్దిగా స్వీట్‌నర్ కలుపుకుని రోజుకు రెండు సార్లుగా తాగుతుంటే కామెర్లు, కాలేయ వ్యాధుల నుంచి త్వరగా కోలుకునే అవకాశం వుంటుంది. ఉదరంలో పేరుకుపోయిన వ్యర్థపదార్థాలను బీరకాయ శుభ్రం చేస్తుంది. అందుకే రోగగ్రస్తులకు బీరకాయను వండి పెడతారు.
*విషతుల్యాలు
లివర్, రక్తం, శరీరంలోని ఇతర టిష్యూలను డిటాక్సిఫై చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. శరీరం నుంచి విషతుల్యాలను వెలికి నెట్టాలంటే మన రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయాల్సి వుంటుంది. బీరలో వుండే అత్యధిక పీచు శరీరంలో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడే రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడానికి చక్కని స్థితిగతులను అందిస్తుంది.
*ఎసిడిటి
బీరకాయ, రసం రెండూ కూడా ఎసిడిటీని తగ్గిస్తాయి. ఎప్పుడూ వేడితో బాధ పడేవారికి బీరకాయ అత్యంత ప్రయోజనకరంగా వుంటుంది. అంతర్గత కూలింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. బీటా కెరాటిన్ అనే శక్తివంత యాంటీ ఆక్సిడెంట్ కూడా లభిస్తుంది.
*చర్మ సౌందర్యానికి
ముదిరిన బీరకాయల్ని ఎండబెట్టి స్పాంజ్‌గా తయారు చేసుకుని చర్మానికి రుద్దితే మృతకణాల్ని తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
*రోగనిరోధక వ్యవస్థ
వీటిలో విటమిన్ సి కూడా ఉండి జలుబుకు దూరంగా వుంచుతుంది. బి విటమిన్‌లు మంచి మూడ్‌ను, యవ్వనాన్ని అందిస్తాయి. జింక్ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. మెగ్నీషియం ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. క్యాల్షియం, ఫాస్పరస్‌లు ఎముకలను దృఢంగా వుంచుతాయి. ఇన్ని రకాల ప్రయోజనాల గల బీరకాయలను అన్ని సీజన్లలోనూ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా వుంటారు. వీటితో రకరకాల వంటల్ని తయారుచేసుకుని వారానికి రెండు సార్లు తినొచ్చు.