Kids

పిల్లలను అందుకే ఎక్కువసేపు పొడుకోనివ్వాలి

పిల్లలను అందుకే ఎక్కువసేపు పొడుకోనివ్వాలి

పసిపిల్లలు ఎక్కువగా నిద్రపోతారన్నది మనకూ తెలుసు. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా రెండున్నరేళ్లు వచ్చేసరికి ఆ నిద్ర సగానికి సగం తగ్గిపోతుంది అంటున్నారు పరిశోధకులు. దీన్నే వాళ్లు ట్రాన్సిషన్‌ పీరియడ్‌ అంటున్నారు. ఇది కేవలం మనుషుల్లోనే కాదు, అన్ని రకాల జంతువుల్లోనూ కనిపించిందట. ఈ విషయాన్ని దాదాపు అరవైకి పైగా అధ్యయనాల ద్వారా గుర్తించారు. ఇలా ఎందుకు జరుగుతుందీ అని పరిశీలించగా- మెదడు, పెరుగుదల, నాడుల అమరికకోసం పుట్టిన రెండున్నరేళ్ల వరకూ వాళ్లకి గాఢ నిద్ర అవసరమవుతుందట. ఆ వయసులో వాళ్లకి నిద్ర ఆహారంతో సమానమట. నాడుల అమరిక పూర్తయ్యాక పిల్లల్లో నిద్ర బాగా తగ్గుతుంది. అదే పసివయసులో గాఢనిద్ర లేకపోతే మెదడు పెరుగుదల మీద ఆ ప్రభావం ఉంటుంది కాబట్టే వాళ్లని పడుకోనివ్వమని పెద్దవాళ్లూ చెబుతారు.