DailyDose

కూతురి కోసం కేసీఆర్ ఎవరిని కట్ చేస్తారో?-తాజావార్తలు

కూతురి కోసం కేసీఆర్ ఎవరిని కట్ చేస్తారో?-తాజావార్తలు

* కవితకు మంత్రి పదవి ఖాయమేనా?ప్రస్తుతం ఫుల్ గా ఉన్న కేసీఆర్ క్యాబినెట్కవితకు పదవి ఇవ్వాలంటే ఒకరిని తప్పించడం తప్పనిసరిఎవరిపై వేటు పడుతుందన్నది ఆసక్తికరంనిజామాబాద్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ కుమార్తె కవిత అందరూ అనుకున్నట్టుగానే విజయం సాధించారు. మొత్తం 823 ఓట్లకుగాను 728 ఓట్లు ఆమెకే పడటంతో విపక్షాల ప్రభావం నామమాత్రం కూడా లేదని నిరూపితమైంది. ఈ ఎన్నికల్లో కవిత గెలుస్తారని, ఆపై రాష్ట్ర మంత్రివర్గంలోకి ఆమెను తీసుకుంటారని ఆది నుంచి ప్రచారం జరుగుతూ ఉండగా, ఇప్పుడు కవిత గెలవడంతో, మంత్రుల్లో కొత్త టెన్షన్ మొదలైంది.వాస్తవానికి ప్రస్తుతం తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు మంత్రి పదవులకు సంఖ్య సరిగ్గా సరిపోయింది. మంత్రులుగా కేవలం 17 మందికి మాత్రమే అవకాశం ఉంది. 17 మంది మంత్రులూ ఉన్నారు. కవితను మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే, ఎవరినో ఒకరిని తొలగించాల్సిందే. ఇదే ఇప్పుడు తెలంగాణ మంత్రుల్లో కొత్త గుబులును రేకెత్తిస్తోందని రాజకీయ విశ్లేషకులు చర్చలు ప్రారంభించారు.కవితను మంత్రిగా తీసుకోవాలంటే, ఒకరిని తీసివేయక తప్పదు. కవిత కోసం ఎవరైనా తన పదవికి త్యాగం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి తాజాగా ఎమ్మెల్సీగా గెలిచిన కవితకు కేవలం 15 నెలల పదవీ కాలం మాత్రమే ఉంది. కానీ, ప్రభుత్వం ఇంకో నాలుగేళ్లు ఉంటుంది. అయితే, ఈ 15 నెలల పదవీ కాలం తరువాత, మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యే, లేదా ఎమ్మెల్సీగా గెలవడానికి ఆమెకు ఇంకో ఆరు నెలల సమయం ఉంటుంది. అంటే, దాదాపు మూడు నెలలు తక్కువ రెండేళ్ల పాటు కవిత మంత్రి పదవిలో కొనసాగవచ్చు. ఆ తర్వాత మళ్లీ ఎమ్మెల్సీగానో, ఎమ్మెల్యేగానో ఎన్నిక కావాల్సి ఉంటుంది.ఇక ఆమెకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తే, ఎవరిపై వేటు పడుతుందన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. ఇదిలావుండగా, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం కేసీఆర్ ముందు పెను సవాలు ఉన్నట్టేనని రాజకీయ నిపుణులు అంటున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఎవరినైనా తప్పిస్తే, కేసీఆర్ విమర్శలను ఎదుర్కోక తప్పదు. అది కాకుంటే, తన సామాజిక వర్గం లేదా, మరో ఉన్నత వర్గం నుంచి ఎవరినైనా తప్పించాలి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయమై సర్వత్ర చర్చ జరుగుతోంది.

* తండ్రి ఆశీస్సులు అందుకున్న కల్వకుంట్ల కవితనిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత విజయంబీజేపీ, కాంగ్రెస్ లకు డిపాజిట్లు గల్లంతుప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన కవితనిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం కోసం జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆమెకు 728 ఓట్లు రాగా, బీజేపీకి 56, కాంగ్రెస్ కు 29 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కవిత తన తండ్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. హైదరాబాద్ ప్రగతి భవన్ కు వెళ్లిన ఆమె సీఎం కేసీఆర్ పాదాలకు నమస్కరించి, ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె వెంట నిజామాబాద్ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు.కాగా, కవిత అత్యధిక మెజారిటీతో గెలవడం పట్ల టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు పెల్లుబుకుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు కూడా రాకపోవడం టీఆర్ఎస్ పట్టు నిరూపిస్తోంది

* సమాచార హక్కు చట్టం అమలు దినోత్సవం ప్రభుత్వ యంత్రాంగాలు అధీనంలో ఉండే సమాచారాన్ని ఒక హక్కులుగా పౌరులు పొందేటందుకు ఆచరణయోగ్యమైన పాలన విధానాన్ని రూపొందించడం కోసం అన్ని ప్రభుత్వ యంత్రాంగాల లో పారదర్శకత జవాబుదారీతనాన్ని పెంపొందించుటకు 2005 ఒచ్త్ 12 న కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసింది…ప్రజల లో సమాచార హక్కు చట్టం గురించి అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలు అధికారుల యొక్క పనితీరును ప్రశ్నించడానికి సమాచార హక్కు చట్టం 2005 వజ్రాయుధం వంటిది.

* శత్రుదేశాల సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యూహాత్మక రహదారులు, వంతెనలను నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసింది భారత్​.ఏడు సరిహద్దు రాష్ట్రాల్లో 44 కీలకమైన వంతెనలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు రక్షణమంత్రి​.అరుణాచల్ ప్రదేశ్​లోని తవాంగ్​ రహదారిలోని నిచేఫూ సొరంగ మార్గం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ పాల్గొన్నారు.శత్రుదేశాల సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యూహాత్మక రహదారులు, వంతెనలను నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసింది భారత్​.ఏడు సరిహద్దు రాష్ట్రాల్లో 44 కీలకమైన వంతెనలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు రక్షణమంత్రి​.అరుణాచల్ ప్రదేశ్​లోని తవాంగ్​ రహదారిలోని నిచేఫూ సొరంగ మార్గం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ పాల్గొన్నారు.

* తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ కీలక వ్యాఖ్యలు.ఏపీ అధికారులు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు.పేపర్లకు లీకులు ఇస్తూ డబుల్ స్టాండ్‍గా ఉన్నారు.తెలంగాణ ప్రతిపాదన లక్షా 60 వేల కిమీ ఒప్పుకుంటేనే ఒప్పందం.టీవీ9 ద్వారా ఓపెన్ చాలెంజ్ చేస్తున్నాం.ఏపీ మంత్రి వచ్చి ఒప్పందం చేసుకోవాలి.

* జాతీయ ప్రవేశ పరీక్ష (నీట్‌) ఫలితాలు వాయిదాపడ్డాయి. సెప్టెంబర్‌ 13 న జరిగిన నీట్‌ పరీక్షా ఫలితాలు షెడ్యూల్‌ ప్రకారం నేడు (సోమవారం) విడుదల కావాల్సి ఉండగా.. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఫలితాలు ఆలస్యం కానున్నాయి. కరోనా నియంత్రణ చర్యలతో పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు అక్టోబర్‌ 14న ఎగ్జామ్‌ నిర్వహించాలని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో చిక్కుకుపోయిన విద్యార్థులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈమేరకు ఫలితాల విడుదల వాయిదా పడింది. అక్టోబర్‌ 16 న ఫలితాలు విడుదల చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

* పలుమార్లు హెచ్చరించినప్పటికీ రాష్ట్రంలోని విద్యాసంస్థలు తమ తీరు మార్చుకోవడం లేదని పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్. కాంతారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఫీజు, ఉద్యోగులకు జీతాలు చెల్లించే విషయంలో కమిషన్ మరియు ప్రభుత్వం ఇది వరకే ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, అయినా ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని ఆయన పత్రికా ప్రకటనలో తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు ప్రారంభించిన కొన్ని విద్యాసంస్థలు అధిక ఫీజు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఆన్లైన్ క్లాసులకు అనుమతి ఇచ్చినంత మాత్రాన ఇష్టం వచ్చిన రీతిలో ఫీజులు వసూలు చేసుకోమని చెప్పినట్లు కాదని ఆయన అన్నారు.

* ఇటీవల సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అవాంఛనీయ రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. న్యాయమూర్తులపై దూషణలకు పాల్పడిన కేసును తాజాగా సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 8 వారాల్లోగా నివేదిక అందజేయాలని ఏపీ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో ఇటీవల కూడా జడ్జిలపై వ్యాఖ్యలు చేసినవారిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా, ఈ దర్యాప్తులో సీబీఐకి సహకరించాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.న్యాయ వ్యవస్థలపైనా, న్యాయమూర్తులపైనా సోషల్ మీడియాలో పోస్టులు పెరిగిపోతుండడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తోంది. ఇటీవల కొన్ని ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు వచ్చిన నేపథ్యంలో జడ్జిల పట్ల అవమానకర రీతిలో పోస్టులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల స్పీకర్ తమ్మినేని సీతారామ్ చేసిన వ్యాఖ్యలపైనా న్యాయస్థానం దృష్టి సారించింది. స్పీకర్ న్యాయవ్యవస్థలపై చేసిన వ్యాఖ్యలను ప్రత్యేకంగా పరిగణించి విచారించక తప్పదని హెచ్చరించింది.

* రాజధానికి సంబంధించి వివిధ పిటిషన్లపై నేటి వాదనలు పూర్తి – విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి సంబంధించి వాదనలు విన్న హైకోర్టు – గెస్ట్ హౌస్ నిర్మాణానికి సంబంధించి ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు – విశాఖ గెస్ట్ హౌస్ వివరాలను కౌంటర్‍లో దాఖలు చేయలేదన్న పిటిషనర్ తరపు న్యాయవాది – కాకినాడ, తిరుపతిలో నిర్మించే గెస్ట్ హౌస్‍ల వివరాలు అందజేసిన ప్రభుత్వం – విశాఖలో నిర్మించే గెస్ట్ హౌస్ నమూనాలు ఇంకా పూర్తి కాలేదని హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం -టెండర్లు పూర్తయ్యాకే పూర్తి వివరాలు చెప్పగలుగుతామన్న ప్రభుత్వం – విశాఖ గెస్ట్ హౌస్ నిర్మాణ అంశంపై తీర్పును రిజర్వులో ఉంచిన న్యాయస్థానం – రాజధాని సంబంధ ప్రధాన పిటిషన్లపై నవంబర్ 2 నుంచి రోజువారీ విచారణ

* ప్రముఖ నటి ఖుష్బూ సుందర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. అంతకుముందు ఆమెను అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగిస్తూ పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఆమె భాజపాలో చేరుతున్నట్లు ఆదివారం ఉదయం నుంచి భారీ స్థాయిలో ఊహాగానాలు వినిపించాయి. ఈ విషయాన్ని చెన్నైకి చెందిన భాజపా నాయకుడు కూడా నిర్ధరించినట్లు పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. నేడు దిల్లీలో పార్టీ జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా సమక్షంలో భాజపా తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమెపై కాంగ్రెస్‌ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

* అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్‌ నాయకత్వంలోని మక్కల్‌ నీది మయ్యం పార్టీలో అభ్యర్థుల ఎంపిక పనులు చురుకుగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా 150 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌ నిర్ణయించారు. ఆ మేరకు రెండు నెలలకు ముందే ఆ నియోజకవర్గాల్లో ఎన్నికల పనులను ప్రారంభించారు. పార్టీ స్థానిక శాఖల నాయకులతో పలు విడతలు చర్చలు జరిపారు. ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా జరిపిన సర్వేలో 50 నియోజకవర్గాల్లో పార్టీ గెలిచేందుకు అవకాశాలున్నాయని లెక్కగట్టారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్ల ప్రకారం ఆ 50 నియోజకవర్గాల్లో ఏడు నుంచి ఎనిమది శాతం దాకా పార్టీ ఓటు బ్యాంకు ఉన్నట్లు గుర్తించారు.