Politics

అది నేనే పంపించాను…

YSRCP MP Raghurama Informs Russian Champagne Pic Is His Own

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన ఫొటోపై ఎంపీ రఘురామ కృష్ణ రాజు స్పందించారు.

ఢిల్లీలోని తన నివాసంలో రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. వైసీపీ నాయకులు తన ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

‘‘మీ బాబాయ్ గారే పెట్టారని తెలిసింది. మూడేళ్ల క్రితం జరిగిన ఫంక్షన్‌లో తీసింది ఇది.

అందులో ఉన్నది నేనే. ఎప్పుడూ చూసుకోలేదు. ఇందులో నేను ఎవరినీ ముట్టుకోలేదు. షాంపేన్ తాగాను. క్రికెట్‌లో క్రీడాకారులు తాగుతుంటారు. పెద్దగా మద్యం లెక్కలోకి రాదు. కలకత్తాలోనో.. హైదరాబాద్‌లోనో సరిగ్గా గుర్తు లేదు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీ ఇచ్చిన ఫంక్షన్‌లో తీసిన ఫొటో ఇది. అందరి నోళ్లలో పోశారు. నా నోట్లో కూడా పోశారు.

అందరి ఫంక్షన్‌లలో రష్యన్ అమ్మాయిలు రావడం సహజమైపోయింది.

అల్లంత దూరంలో వాళ్లు అలాగా షాంపేన్ పోస్తే… ఉన్మాదుల్లారా… పిచ్చి వెధవల్లారా… ఏదో జరిగినట్టు ప్రచారం చేస్తున్నారు.

ఏముంది దాన్లో… నేనే చూపించాను కదా. ప్రెసిడెంట్ మెడలో… నోబుల్ ప్రైజ్ లాంటి చెత్త డ్రింక్ కాకుండా మంచి షాంపేన్ తాగాను.

అవి తాగి చచ్చిపోవాలా? వెర్రి వెధవల్లారా… నేనే ఓ 500 మందికి పంపాను’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

మంత్రి పెద్దిరెడ్డి ఫోటోతో, ఎంపీ అవినాష్ రెడ్డి ఫోటోతో డీపీ పెట్టుకొని కొంతమంది వ్యక్తులు తనను అసభ్యంగా దూషిస్తూ మెసేజీలు పంపుతున్నారన్నారు.

దీనిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారా లేదా అన్నది చూడాలన్నారు. లేదంటే ఢిల్లీ పోలీసులు చూసుకుంటారని చెప్పుకొచ్చారు.