Politics

అపోహలపై చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

ఆగ్రహంతో జగన్ అపోహలపై చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ ముఖ్యనేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవినీతి బురద అంటించడం, జనాల్లో అపోహలు పెంచడం జగన్ నైజం అని విమర్శించారు. ప్రశ్నించినవాళ్లపై దాడులు చేయడం, బెదిరించి, భయాందోళనలకు గురిచేసి లొంగదీసుకోవడం జగన్ రాజకీయం అని వివరించారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరో పెద్ద తప్పు చేస్తుంటాడని, జగన్ కు ఇలా చేయడం బాగా అలవాటైందని అన్నారు. నేరచరిత్ర ఉన్నవాళ్లు అధికారంలోకి వస్తే జరిగే విపరిణామాలకు ఆంధ్రప్రదేశ్ ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. దేశంలో ఎన్నడూ చూడనంతటి దుర్మార్గ పాలనను ఏడాదిగా చూస్తున్నామని అన్నారు. అధికారం అంటే ప్రజలను చంపడానికి ఇచ్చిన లైసెన్స్ అనుకుంటున్నారా? అని ఆగ్రహంతో ప్రశ్నించారు.