Politics

చంద్రబాబు పేరు చేర్చాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు-తాజావార్తలు

Andhra High Court Asks To Add Chandrababu's Name

* ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌లో చంద్రబాబు పేరు లేకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.ఈ పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం.. స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌లో చంద్రబాబు పేరు నమోదు చేసి నెలలో జీవో ఇవ్వాలని ఆదేశించింది.ఎస్ఎస్సీలో ప్రతిపక్ష నేత పేరు లేకపోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని తెలిపింది.తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.

* సీఎం పదవి నుంచి జగన్‌ను తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు అయింది.జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ లేఖను విడుదల చేశారంటూ సీఎం జగన్‌పై న్యాయవాదులు జి.ఎస్. మణి, ప్రదీప్‌కుమార్ యాదవ్ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.సీఎం జగన్‌పై దాదాపు 30 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.మనీ లాండరింగ్‌ కేసు కూడా నమోదైందని జి.ఎస్. మణి, ప్రదీప్‌కుమార్ యాదవ్ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

* ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కామెంట్స్…ఏపీలో దేశంలోనే తొలిసారిగా పోలీస్ యాప్ ద్వారా పోలీస్ స్టేషన్కు రాకుండానే ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించాం.ఈ యాప్ ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకునే అవకాశం సామాన్యులు కూడా కలిగింది.సాంకేతికంగా పోలీస్ శాఖ ముందడుగు వేస్తుంది.ఈ రోజుల్లో మరింత టెక్నాలజీని ఉపయోగించుకుని పోలీస్ సేవలను సామాన్యులకు చేరువ చేస్తాం.దేశంలోనే తొలిసారిగా హోంగార్డులకు 30లక్షల హెల్త్ స్కీమ్ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు.హోంగార్డులకు కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా రుణాలు అందిస్తున్నాం.గతంలో పిఎస్ కు రావాలంటే మహిళలు భయపడే వాళ్ళు.స్పందన లాంటి కార్యక్రమాల ద్వారా మహిళలు ధైర్యంగా పోలీస్ స్టేషన్ కి వస్తున్నారు.పోలీసు వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత భద్రత, భరోసాకల్పిస్తాం.

* ఏ.పి.లో 24 గంటల్లో 3,892 కొత్తగా కేసులు నమెుదు, దింతొ 7,67,465 చెరిన కేసులు, రాష్ట్రంలో 28 మంది మరణించగ,ఇప్పటి వరకు 6,319 మంది మరణించారు

* దేవదాయ శాఖకు చెందిన స్థలంలో టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ శాశ్వత కట్టడాలు నిర్మిస్తున్న విషయమై సాక్ష్యాధారాలు సేకరించేందుకు వెళ్లిన ఆ శాఖ ఉద్యోగులపై దౌర్జన్యానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దేవదాయశాఖ అధికారులు, సిబ్బంది ని మెయిన్‌రోడ్‌పై నిలబెట్టి ఆ మాజీ ఎంపీటీసీ, ఆమె కు టుంబ సభ్యులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. సాక్ష్యాలను వీడియో చిత్రీకరిస్తున్న దేవదాయశాఖ ఉద్యోగిని దగ్గర్లోని ఓ దుకాణంలోకి లాక్కెళ్లి పిడిగుద్దులు కురిపించి, ఆయన వేసుకున్న దుస్తులు చించేసి… ఆయన మొబైల్‌ఫోన్‌ను లా క్కుని బయటకు తోసేశారు. హతాశులైన దేవదాయశాఖ అధికారులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమపై జరిగిన దౌర్జన్యంపై ఫిర్యాదు చేశారు.

* పతంజలి ఆయుర్వేద్ సహ వ్యవస్థాపకుడు, యోగాసనాలకు పెట్టింది పేరైన బాబా రామ్‌దేవ్ ట్విటర్ ట్రెండింగ్‌లో ఉన్నారు. ఒక ఆశ్రమంలో ఏనుగు మీద యోగా నేర్పిస్తూ కిందపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయనపై సానుభూతితో పాటు కొంతమంది నెటిజనులు రకారకాల మీమ్స్ తో, యాక్ట్ ఆఫ్ గ్రావిటీ అంటూ వ్యంగ్యోక్తులతో సందడి చేస్తున్నారు.

* మీ వద్ద ఒక రూపాయి నాణెం ఉంటే మీరు ఎంచక్కా పాతిక లక్షలు సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ రూపాయి నాణెం కనీసం వందేళ్ల కిందటిది అయి ఉండాలి. పురాతన నాణేలను దేశంలో అతిపెద్ద ఆన్‌లైన్‌ మార్కెట్‌ సంస్థ ఇండియామార్ట్‌ వేలం వేస్తుంటుంది. మీ వద్ద అలాంటి పురాతన, అపురూప నాణెం ఉంటే మీరు దాన్ని వేలంలో ఉంచి లక్షల రూపాయలు గెలుచుకోవచ్చు. మీరు 1913 నాటి రూపాయి నాణేన్ని కలిగిఉంటే దాన్ని మీరు రూ 25 లక్షలకు వేలం వేయవచ్చు. వెండితో రూపొందిన విక్టోరియా కాలం నాటి ఈ నాణేల ధరను ఇండియామార్ట్‌పై రూ 25 లక్షలుగా నిర్ణయించారు.

* భారీ వర్షాల కారణంగా విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. రాంబిల్లి మండలం గురజాల గ్రామం వద్ద శారదా నదికి గండి పడటంతో దాదాపు 4500 ఎకరాల వరి పంట నీట మునిగింది. అదే సమయంలో గ్రామం చుట్టూ నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స‌మాచారం తెలిసిన వెంట‌నే పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి ప‌రిశీలించారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేరకు వరదలు తగ్గిన వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకుంటామని మంత్రి అవంతి తెలిపారు.

* రాష్ట్రంలో డతెరప లేకండా వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నందున తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ సూచించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడనున్నందున ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వర్షాల వల్ల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని, వరద బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. బీజేపీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలంతా స్థానిక పరిస్థితుల్ని అధికారుల దృష్టి తీసుకెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.

* దేశీయ దిగ్గజ సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ మెరుగైన ఫలితాలను ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ ఏకీకృత నికర లాభం 20.5 శాతం వృద్ధితో రూ. 4,845 కోట్లుగా వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 4,019 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. కంపెనీ ఏకీకృత ఆదాయం 8.6 శాతం పెరిగి రూ. 24,570 కోట్లకు చేరుకుంది. గతేడాది సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 22,629 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.

* వర్షాలు, వరదలతో రెండున్నర నెలల నుంచీ రైతులకు వరుసగా దెబ్బమీద దెబ్బ తగులుతోంది. వారం, పది రోజుల వ్యవధిలోనే పంటల్ని ముంచెత్తుతుండటంతో అన్నదాతలు భారీగా నష్టపోయారు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు పంట పొలాలు నీట మునిగాయి. సుమారు లక్షన్నర ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయని అంచనా. ఎకరాకు రూ.20 వేల లెక్కన చూసినా.. సుమారు రూ.300 కోట్లు నష్టం జరిగినట్లే

* ద‌స‌రా ఉత్స‌వాల సంద‌ర్భంగా ఈనెల 17 నుంచి 25వ తేదీ వ‌ర‌కు విజ‌య‌వాడ‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. నగర ప్రజలకు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ట్రాఫిక్ మళ్ళింపులు చేశామ‌ని ,పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశామ‌ని సీపీ బత్తిన శ్రీనివాసులు అన్నారు. విజయవాడ మీదుగా ఇతరప్రాంతాలకు వెళ్లే వాహనాలకు సిటీలోకి అనుమతి లేద‌ని తెలిపారు. విశాఖపట్నం – హైదరాబాద్ మధ్య వాహనాలు హనుమాన్ జంక్షన్ నూజివీడు-మైలవరం-జీ కొండూరు – ఇబ్రహీంపట్నం మీదుగా, విశాఖపట్నం-చెన్నై మధ్య వాహనాలు హనుమాన్ జంక్షన్-అవనిగడ్డ-రేపల్లె-బాపట్ల-చీరాల మీదుగా, గుంటూరు -విశాఖపట్నం మధ్య వాహనాలు బుడంపాడు నుంచి పొన్నూరు-రేపల్లె-అవనిగడ్డ-హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లింపు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

* తెలంగాణలో వర్షం సృష్టించిన బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ట్విటర్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. తక్షణ సహాయం కింద తెలంగాణ రాష్ట్రానికి రూ.2వేల కోట్లు ఇవ్వాలని కోరారు. కుండపోతగా కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ నిండా మునిగిందని, జనజీవనం అస్తవ్యస్తం కావడంతో పాటు చేతి కొచ్చిన పంట నీట మునిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.

* వరద ప్రభావిత ప్రాంతాల శిబిరాల్లో ఉన్నవారిపట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని.. వారికి రూ.500 చొప్పున ఆర్థికసాయం అందించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వరద సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని.. అన్ని చోట్ల విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు. రాష్ట్రంలో వరద పరిస్థితి, సహాయ కార్యక్రమాలపై జిల్లాల వారీగా అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రోడ్లపై గుంతలు పూడ్చి అవసరమైన మరమ్మతులు చేయాలని దిశానిర్దేశం చేశారు. వరద తగ్గిన అనంతరం అంటు వ్యాధులు ప్రబలకుండా చూడాలని.. పీహెచ్‌సీల్లో అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు.

* కరోనా సంక్షోభంలో రుణగ్రహీతలకు ఇచ్చిన మారటోరియం కాలంలో విధించిన చక్రవడ్డీ మాఫీ విషయంపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ అమలు ఏమైందని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. చక్రవడ్డీ మాఫీపై నిర్ణయం తీసుకున్నామని.. అయితే ఇంకా అమలు చేయలేదని సోలిసిటరీ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు. మరోవైపు రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేస్తామని బ్యాంకుల తరఫు న్యాయవాది హరీష్‌ సాల్వే కూడా కోర్టుకు తెలిపారు.

* ఐఫోన్‌ వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్‌ 12 వచ్చింది. ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 12 ప్రొ, ఐఫోన్‌ 12 ప్రొ మ్యాక్స్, ఐఫోన్‌ 12 మినీని యాపిల్‌ మంగళవారం విడుదల చేసింది. 30 నుంచి భారత్‌లో వీటి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఐఫోన్ల ధరలను కంపెనీ తగ్గించింది. ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌, ఐఫోన్‌ ఎస్‌ఈ, ఐఫోన్‌ 11 ఎంఆర్‌పీ ధరలను సవరించి.. కొత్త ధరల వివరాలను యాపిల్ ఇండియా తమ ఆన్‌లైన్‌ స్టోర్‌లో ఉంచింది. అయితే, ధర తగ్గించిన నేపథ్యంలో ఐఫోన్లతో పాటు వచ్చే ఛార్జర్‌, ఇయర్‌పాడ్స్‌ను యాపిల్‌ తొలగించింది. ఇకపై ఐఫోన్‌ను కొనుగోలు చేస్తే అందులో ఐఫోన్‌తోపాటు కేవలం ఛార్జింగ్‌ కోసం కేబుల్‌ కనెక్టర్‌ మాత్రమే ఇవ్వనున్నారు. ఐఫోన్‌ 12ను ఛార్జర్‌, ఇయర్‌పాడ్స్‌ లేకుండా అమ్మనున్నారు. దీంతో వీటిని కూడా అలాగే విక్రయించాలని సంస్థ నిర్ణయించింది.

* తలసరి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పరంగా ఈ ఏడాది భారత్‌ను బంగ్లాదేశ్‌ దాటనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) షాకింగ్ వివరాలు వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 10.3 శాతం కుచించుకుపోనుందని తెలిపింది. ‘వరల్డ్ ఎకనామిక్ అవుట్ లుక్’ పేరుతో మంగళవారం ఐఎంఎఫ్ ఈ నివేదికను విడుదల చేసింది.

* ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న కేరళలోని యునైటెడ్‌ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ (యూడీఎఫ్‌) చీలిపోయింది. యూడీఎఫ్‌ నుంచి వైదొలుగుతున్నట్లు కేరళ కాంగ్రెస్‌ (ఎం) కార్యనిర్వాహక ఛైర్మన్‌ జోస్‌ కే మణి తెలిపారు. రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేరళ అధికార వామపక్ష కూటమి లెఫ్ట్‌ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఫ్‌)లో చేరారు. యూడీఎఫ్‌ నుంచి కేరళ కాంగ్రెస్‌ (ఎం) దాదాపు 38 ఏళ్ల తర్వాత విడిపోవడం గమనార్హం.

* రాజ్యసభలో ఖాళీ కానున్న 11 స్థానాల భర్తీకి నవంబరు 9న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌ ఈ నెల 20న వెలువడుతుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 10, ఉత్తరాఖండ్‌లో ఒకటి చొప్పున స్థానాలు ఖాళీ కానున్నాయి. పదవీ విరమణ చేయనున్న సభ్యుల్లో కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి (భాజపా), సినీ నటుడు రాజ్‌ బబ్బర్‌ (కాంగ్రెస్‌), పి.ఎల్‌.పునియా (కాంగ్రెస్‌) రామ్‌గోపాల్‌ యాదవ్‌ (ఎస్పీ) వంటివారు ఉన్నారు. వీరి పదవీకాలం వచ్చే నెల 25తో ముగుస్తుంది. ఈ స్థానాలకు 9న ఎన్నికలు నిర్వహించి అదేరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపడతారు. 11 స్థానాల్లో పదింటిని భాజపా నేతృత్వంలోని ఎన్డీయే దక్కించుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం యూపీ శాసనసభలో 395 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 306 మంది భాజపా వారే. 9 మంది అప్నాదళ్‌ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు భాజపా సర్కారుకు మద్దతు ఇస్తున్నారు. రాజ్యసభకు ఒక అభ్యర్థి యూపీ అసెంబ్లీ నుంచి నెగ్గాలంటే 37 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ ప్రకారం భాజపా సునాయాసంగా 8 స్థానాలు గెలుచుకుంటుంది. కొద్దిమంది ఎమ్మెల్యేల మద్దతు సమీకరించగలిగితే 9వ స్థానం కూడా లభిస్తుంది.

* కరోనా వైరస్‌పై పోరాటానికి భారత్‌ స్వదేశీ పరిజ్ఞానంతో రెండు వాక్సిన్లను అభివృద్ధి చేస్తోంది. ఈ టీకాల తొలి దశ ఫలితాలు ఆశాజనకంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వ్యాక్సిన్ల రెండో దశ ఫలితాలు నవంబరు తొలివారంలో వస్తాయని తెలిసింది. భారత వైద్య పరిశోధన మండలి ‌(ఐసీఎమ్‌ఆర్‌)తో కలిసి భారత్‌ బయోటెక్‌ తయారు చేస్తున్న ఈ కరోనా వ్యాక్సిన్లు వచ్చే ఏడాది తొలినాళ్లలో అందుబాటులోకి రానున్నట్లు ఇప్పటికే కేంద్ర వైద్యశాఖ ప్రకటించింది.

* ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చే రీతిలో కరోనావైరస్‌కు చికిత్స పొంది కోలుకున్నట్లు చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. ఇప్పుడు తనకు తాను సూపర్ మ్యాన్‌తో పోల్చుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న ఆయన పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తనకు చికిత్స అందించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు, తన రోగనిరోధక శక్తి గురించి గొప్పగా చెప్పుకున్నారు. ‘నేను ఏదో తీసుకున్నాను. అది ఏదైనా కావొచ్చు. కానీ, నేను త్వరగా కోలుకున్నా. నాకు నేను సూపర్‌ మ్యాన్‌లా అనిపిస్తోంది. మన వద్ద గొప్ప వైద్యులు ఉన్నారు.

* లీగ్‌ ఆరంభానికి ముందు ప్రతిసారి.. ‘‘ఈ సాలా కప్ నమదే నినాదంతో బరిలోకి దిగడం..మెరుగ్గా రాణించి ట్రోఫీ సాధిస్తారునుకోవడం.. అంచనాలు అందుకోలేక చతికిలపడటం.. అభిమానులు నిరాశచెందడం..’’ గత సీజన్లలో కోహ్లీసేన పరిస్థితి ఇది. కానీ ఈ సీజన్‌లో మురిపిస్తోంది. ఆల్‌రౌండర్‌ షోతో మైమరిపిస్తోంది. అవును ఇది 2020 కదా! ఊహించినది జరగదని మరోసారి నిరూపిస్తోంది. గతంలో ఒకరిద్దరి ప్లేయర్ల మీద ఆధారపడిన జట్టు సమష్టి విజయాలు సాధిస్తోంది. ఒక్కప్పుడు బలహీనతగా మారిన ఆ జట్టు బౌలర్లే ఇప్పుడు మ్యాచ్‌ విజేతలు అవుతున్నారు. కోహ్లీసేనలో ఈ అనుహ్య మార్పులకు కారణాలేంటి?