Politics

జగన్‌పై ఢిల్లీ హైకోర్టు బార్ ఆగ్రహం

Delhi High Court Bar Asso Angry Against Jagan's Comments On Justice NV Ramana

సీఎం జగన్‍పై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ సీరియస్ – సీజేఐకి సీఎం జగన్ లేఖ రాయడం తప్పు – న్యాయవ్యవస్థను కించపరిచేలా, బురదజల్లేలా జగన్ లేఖ ఉంది – జగన్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం – సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మచ్చలేని వ్యక్తి – అలాంటి వ్యక్తిపై ఆరోపణలు చేయడం తగదు – జగన్ లేఖ కోర్టు ధిక్కారం కిందకే వస్తుంది – ఇది న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తిపై దాడి చేయడమే – ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి – ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని వమ్ముచేసేలా జగన్ లేఖ ఉంది – రాజ్యాంగ వ్యవస్థలపై జగన్ దాడి చేయడం దురదృష్టకరం – న్యాయవ్యవస్థపై జోక్యం చేసుకునే వికృష్టమైన ప్రయత్నాలను సీఎం జగన్ మానుకోవాలి – జగన్ చర్యలను తత్యంత తీవ్రమైన పదజాలంతో ఖండిస్తున్నాం – జస్టిస్ ఎన్వీ రమణ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా చేశారు – అత్యుత్తమ నిబద్దతరల న్యాయమూర్తుల్లో జస్టిస్ ఎన్వీ రమణ ఒకరు – జగన్ ఆరోపణల్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నాం – న్యాయ వ్యవస్థను బెదిరించడానికి జగన్ కుతంత్రాలు చేస్తున్నారు – న్యాయమూర్తులపై ఆరోపణల్లో ఎలాంటి హేతుబద్దత లేదు : ఢిల్లీ హైకోర్టు బార్ అసోషియేషన్