DailyDose

భారీ వర్షాలకు ఆరుగురు గల్లంతు-నేరవార్తలు

భారీ వర్షాలకు ఆరుగురు గల్లంతు-నేరవార్తలు

* కల్లూరు మండలం, పెద్దకొండిలో బడికుంట చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన సత్యనారాయణ మూర్తి చెరువుకు గండి పడడంతో ప్రవాహంలో కొట్టుకుపోయాడు. పెనుబల్లి, రాతోని చెరువు అలుగు దాటుతుండగా ప్రవాహం ఉధృతికి మల్లెల రవి, అతని కుమారుడు జగదీష్ కొట్టుకుపోయారు. భువనగిరి రూరల్ మండలం, నాగిరెడ్డిపల్లి వద్ద వరద ఉధృతికి ముగ్గురు గల్లంతు అయ్యారు. ఖమ్మం జిల్లా తల్లాడలో 20 గొర్రెలు మృతి చెందాయి. భువనగిరి, చిట్యాల మార్కెట్ పల్లి, అద్దంకి హైవేలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై వరద పోటెత్తింది. ఈ రహదారిపై గూడూరు, పగిడిపల్లి గ్రామాల మధ్య మోకాలు లోతు నీళ్లు నిలిచాయి. చిట్యాల రైల్వే బ్రిడ్జి వద్ద చౌటుప్పల్ మండలం, ఎల్లగిరి వద్ద జాతీయ రహదారిపై మోకాళ్లలోతు నీరు చేరింది.

* సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై వచ్చిన అక్రమ మైనింగ్ ఆరోపణలపై బుధవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.అయితే అక్రమ మైనింగ్ జరగలేదని మైనింగ్ శాఖ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు.దీంతో పిటిషనర్ దారుడు పేర్కొన్న ప్రతివాదులందరి తరపున కౌంటర్లు దాఖలు చేయాలని మైనింగ్ శాఖను ధర్మాసనం ఆదేశించింది.ప్రైవేట్ ప్రతివాదులు కూడా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు పేర్కొంది.

* ధర్మవరం టౌన్ లో సత్యసాయినగర్ లో భర్త కాపురానికి పిలుచుకోలేదని భర్త ఇంటిముఒదు భార్య చిన్న పాప తో ధర్నా

* సీఎం జగన్‍పై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ సీరియస్- సీజేఐకి సీఎం జగన్ లేఖ రాయడం తప్పు- న్యాయవ్యవస్థను కించపరిచేలా, బురదజల్లేలా జగన్ లేఖ ఉంది- జగన్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం- సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మచ్చలేని వ్యక్తి- అలాంటి వ్యక్తిపై ఆరోపణలు చేయడం తగదు- జగన్ లేఖ కోర్టు ధిక్కారం కిందకే వస్తుంది- ఇది న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తిపై దాడి చేయడమే- ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి- ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని వమ్ముచేసేలా జగన్ లేఖ ఉంది- రాజ్యాంగ వ్యవస్థలపై జగన్ దాడి చేయడం దురదృష్టకరం- న్యాయవ్యవస్థపై జోక్యం చేసుకునే వికృష్టమైన ప్రయత్నాలను సీఎం జగన్ మానుకోవాలి- జగన్ చర్యలను తత్యంత తీవ్రమైన పదజాలంతో ఖండిస్తున్నాం- జస్టిస్ ఎన్వీ రమణ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా చేశారు

* దాచేపల్లి మండలం ఇరికేపల్లి వద్ద ఉన్న కెమికల్ ఫ్యాక్టరీ సమీపంలో ఏర్పాటు చేసిన మెటీరియల్ రూమ్ లో అగ్నిప్రమాదం

* జగన్ అక్రమాస్తుల వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసులపై హైదరాబాద్‌లోని సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది.

* గురువారం హాథ్రస్​ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం అఫిడవిట్​ దాఖలు చేసింది.

* ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో హైదరాబాద్‌ చాంద్రాయణగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. బండ్లగూడ మహ్మదియా నగర్‌లోని ఓ పహిల్వాన్‌కు చెందిన ఫామ్‌హౌస్‌ గ్రానైట్‌ గోడ కూలి పక్కనే ఉన్న రెండిళ్లపై పడింది. ఈ ఘటనలో 11మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతులంతా రెండు కుటుంబాలకు చెందిన వారే. ఈ ఘటనలో గాయపడిన నలుగురిని పోలీసులు మొగల్‌పురలోని అస్రా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎంపీ అసద్, ఎమ్మెల్యే అక్బర్‌ పరామర్శించారు. గ్రానైట్‌ రాయితో నిర్మించిన ఈ గోడ పాతది కావడం.. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు కూలి ఉండచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.