Business

TRP కుంభకోణాలకు చెక్

TRP కుంభకోణాలకు చెక్

పలు ఛానెళ్లు టీఆర్‌పీ కుంభకోణానికి పాల్పడటంపై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో బ్రాడ్‌కాస్ట్‌ ఆడియన్స్‌ రీసెర్చి కౌన్సెల్‌ (బార్క్‌) గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని భాషల్లోని వార్తా ఛానెళ్లకు ప్రతివారం ఇచ్చే రేటింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మూడు నెలల పాటు రేటింగ్‌లు ఇవ్వబోమని రేటింగ్స్‌ ఏజెన్సీ ఓ ప్రకటనలో స్పష్టంచేసింది. ప్రస్తుతం ఉన్న ప్రమాణాలను సాంకేతిక కమిటీతో సమీక్షించి వాటిని మరింతగా మెరుగుపరచాలని భావిస్తున్న బార్క్‌.. 12 వారాల పాటు వీక్లీ రేటింగ్‌లు ఇచ్చే ప్రక్రియను నిలిపివేయనున్నట్టు పేర్కొంది. తప్పుడు టీఆర్‌పీలతో మోసాలకు పాల్పడుతున్నట్టు ఆరోపిస్తూ మూడు ఛానెళ్లపై ముంబయి పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. రిపబ్లిక్‌ టీవీ సహా మరో రెండు మరాఠా ఛానళ్లు ఈ మోసాలకు పాల్పడినట్లు ముంబయి పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌వీర్‌సింగ్‌ ఇటీవల వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఆయా ఛానళ్లకు చెందిన ఐదుగురిని అరెస్ట్‌ చేశారు.