DailyDose

ప్రముఖ సినీనటుడు అరెస్ట్-నేరవార్తలు

ప్రముఖ సినీనటుడు అరెస్ట్-నేరవార్తలు

* గుట్కా అక్రమ రవాణా కేసులో సినీ నటుడు, నిర్మాత, వ్యాపార‌వేత్త సచిన్‌ జోషిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాన్‌ మసాలాల ముసుగులో నిషేధిత గుట్కాలు తయారీ, సరఫరా చేస్తున్న ఆయనను ముంబై విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌ నుంచి ముంబైకి వచ్చిన సచిన్‌ జోషిని నిర్బంధంలోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. కాగా హైదరాబాద్‌కు అక్రమంగా గుట్కా తరలింపులో సచిన్‌ జోషి హస్తమున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆయనపై ఐపీసీ 273,336 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్‌లో భారీగా గుట్కా అక్రమ రవాణాని పోలీసులు పట్టుకున్నారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే నిషేధిత గుట్కాల తయారీ, సరఫరాపై సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిఘా పెంచారు. పెద్ద మొత్తంలో గుట్కా బాక్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గుట్కా కోట్ల రూపాయల్లో ఉంటుందని సమాచారం. ఈ కేసులో నిందితుల విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విచారణలో సచిన్‌ జోషి పేరు బయటకు రావడంతో ఆయనపై బ‌హ‌దూర్ పురా పోలీస్ స్టేష‌న్ లో ఐపీసీ సెక్ష‌న్ 336, 273 కింద కేసు నమోదు అయింది. అప్పటి నుంచి సచిన్‌ జోషి విదేశాల్లో ఉండటంతో పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. దుబాయ్‌ నుంచి ముంబైకి రాగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఇక హిందీలో అత్యంత సంపన్నమైన నటుల్లో సచిన్‌ జోషి ఒకరు. ఆయన గుట్కా వ్యాపారంలో ప్రసిద్ధి చెందాడు. గుట్కా కింగ్‌గా ఆయన తండ్రిని పిలుస్తుంటారు. ఓ వైపు ముంబయి, మరోవైపు హైదరాబాద్‌లో అక్రమంగా ఈ వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్రమంగా భారీ సంపాదించి ఎంజాయ్‌ చేస్తుంటారని, అందులో భాగంగానే సినిమాలు చేస్తున్నారని భోగట్టా. సచిన్‌ జోషి ‘మౌనమేలనోయి, నిను చూడక నేనుండలేను, ఒరేయ్‌ పండు, ఆజాన్‌, జాక్‌పాట్‌, వీరప్పన్‌, వీడెవడు, నెక్ట్స్ ఏంటీ, అమావాస్‌ చిత్రాల్లో నటించారు. ఇదిలా ఉంటే ఇటీవల బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు కలకలం సృష్టించిన నేపథ్యంలో తాజాగా సచిన్‌ని అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

* రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ బిల్లును కేంద్రం వెనక్కి పంపింది.బిల్లులో లోపాలున్నాయని, వాటిపై అభ్యంతరాలు తెలిపింది. సరిచేయాలంటూ వెనక్కి పంపింది. దీంతో ఈ చట్టం ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది.కేంద్రం సూచించిన అంశాలతో మళ్లీ కొత్త ముసాయిదా సవరణ బిల్లు రూపొందించి దాన్ని అసెంబ్లీలో ఆమోదించుకోవాలి.

* మంచిర్యాల బెల్లంపల్లి పట్టణంలోని పొచమ్మ చెరువులో దూకి బెల్లంపల్లి పట్టణానికి చెందిన భార్య భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు.బెల్లంపల్లి పట్టణంలోని సుభాష్ నగర్ కు చెందిన మల్లేష్,అతని భార్య నర్మద శుక్రవారం పట్టణంలోని పోచమ్మ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకుఅనారోగ్యసమస్యలతో బాధపడుతున్నట్లు సూసైడ్ నోట్ చెరువు గట్టున లభించినట్లు సమాచారం.

* డిల్లీలో న్యాయవాదిపై ఐ.టి శాఖ దాడులు రూ. 5 కోట్ల నగదు స్వాధీనం …ఒక కేసు విషయంలో క్లయింట్ నుండి రూ.217 కోట్లు తీసుకున్న న్యాయవాది.న్యాయవాది తీసుకున్న రూ.217 కోట్లు ఎవరెవరికి ఎంతెంత పంచాలో .. అదే ఆయన టీం లో పని చేసిన వారికిన్యాయవాడికి సంబందించిన 38 చోట్ల ఐటీ శాఖ దాడులు …రూ.100 ల కోట్లలో లావాదేవీలు జరిగినట్లుగా సమాచారం.. ఇంకా తవ్వుతున్న ఐటీ అధికారులు.

* ప్రముఖ సినీతారలు దీపికా పడుకోన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ల ఫొటోలు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) పథకం జాబ్ కార్డుల్లో దర్శనమిచ్చిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. సినీనటీమణుల చిత్రాలతో కూడిన 10కి పైగా నకిలీ జాబ్ కార్డులు బయటపడ్డాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జిర్న్యా జిల్లా పిపార్కెడా నాకా గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, ఉపాధి పథకం సహాయకులు సినీనటీమణుల చిత్రాలతో నకిలీ జాబ్ కార్డులతో ఖాతాల నుంచి ఉపాధి హామీ పథకం డబ్బులు స్వాహా చేశారని దర్యాప్తులో తేలింది. ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులపై సినీనటీమణులు దీపికా పడుకోన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ల చిత్రాలు కనిపించడంతో ఉన్నతాధికారులు ఖంగు తిన్నారు.