DailyDose

కుప్పంలో కాల్పుల కలకలం-నేరవార్తలు

కుప్పంలో కాల్పుల కలకలం-నేరవార్తలు

* కుప్పంలో కాల్పుల కలకలం.. ప్రతిపక్ష పార్టీ నేత లక్ష్యంగా దాడి !చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దులో కాల్పుల కలకలం రేపుతోంది.డీఎంకే నేత వేలాయుధంపై నాటు తుపాకీలతో కాల్పులు జరిపారు దుండగులు.దీంతో డీఎంకే నేత వేలాయుధం తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించి అందిస్తున్నారు.కుప్పం సమీపంలోని తమిళనాడు రాష్ట్రం నారాయణపురంలోఈ ఘటన చోటు చేసుకుంది.కాల్పుల తర్వాత నిందితులు కుప్పం వైపు పరారయ్యారని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

* హైదరాబాద్ మహానగరంలో గత కొద్దిరోజులుగా రాత్రుళ్లు భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి.అకస్మాత్తుగా శబ్దాలు రావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు.మొన్నటిమొన్న బోరబండలో వరుసగా శబ్దాలు వినిపించడంతో అక్కడి వాసులు నిద్రలేని రాత్రులు గడిపినట్లు సమాచారం.తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌‌లో అర్ధరాత్రి భారీ శబ్దాలు వినిపించాయి.సులేమాన్ నగర్, చింతల్ మెట్, పహాడీ షరీఫ్ తదితర ప్రాంతాల్లో సౌండ్స్ వచ్చాయి.దీంతో జనం భయంతో ఇంట్లో నుంచి పరుగులు తీశారు. గతంలోనూ ఇదేవిధంగా శబ్దాలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.కానీ, దాని వెనుక ఉన్న మర్మం ఇప్పటివరకు తెలియరాలేదు.

* ఏనుగుల దాడిలో సుమారు 15 లక్షల విలువ చేసే పంట నష్టం..ఎఫ్ఆర్వో కార్యాలయం వద్ద రైతుల ధర్నా..న్యాయం చేయాలంటూ నినాదాలు..రైతులు ఎంత సేపు ఉన్నా పట్టించుకోని ఎఫ్.ఆర్.ఓ.పలమనేరు నియోజకవర్గ పరిధిలో ప్రతిరోజూ ఏనుగుల గుంపు పంటలను నాశనం చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి మండలంలోని పెంగరగుంట గ్రామ సమీపంలోని వివిధ పంట పొలాలపై దాడులు చేసిన ఏనుగులు చేతికొచ్చిన వారి పంటను తొక్కి నాశనం చేసాయి.దీంతో ఆగ్రహం చెందిన రైతులు సుమారు 20 మంది దాకా పలమనేరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కార్యాలయం వద్దకు చేరుకుని తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.ఎంతసేపైనా అధికారులు ఎవరూ పట్టించుకోక పోవడంతో ఆగ్రహం చెందిన రైతులు అటవీశాఖ అధికారులతో వాదనకు దిగారు.

* విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం లంబసింగి అటవీశాఖ చెక్ పోస్ట్ వద్దHR56 B7176 నెంబరు గల కంటైనర్ లో భారీగా గంజాయి పట్టివేత

* ద్విచక్ర వాహనాలు చోరీ ముఠా గుట్టు రట్టు.ఇద్దరు దొంగలు అరెస్ట్, మరోకరు పరారీ32 ద్విచక్ర వాహనాలు స్వాధీనం.అనంతపురం జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు కామెంట్స్…క్రికెట్ బెట్టింగ్ లపై విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలి.క్రికెట్ బెట్టింగులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.ఆన్లైన్ బెట్టింగులకు పాల్పడుతూ యువత పెడదోవ పడుతోంది.గత 10 మాసాల్లో 57 కేసులు నమోదు చేశాం.క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడే 151 మంది అరెస్ట్. 834320 రూపాయలు స్వాధీనం.క్రికెట్ బెట్టింగ్ వెనుక అంతర్జాతీయ రాకెట్ ప్రమేయం ఉంది.విద్యార్థుల కదలికలపై తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి.

* బెజవాడలో హవాలా నగదు కలకలం..భవానీపురంలో వ్యాపారుల దగ్గర రూ.35 లక్షలు పట్టివేత,టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల అదుపులో ముగ్గురు అనుమానితులు.

* అంతర్ రాష్ట్ర చైన్ స్నాచర్ బండి శివకుమార్ ను అరెస్ట్ చేసిన గుంటూరు అర్బన్ పరిధి పోలీసులు.అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గుంటూరు అర్బన్ మరియు రూరల్, ప్రకాశం, నెల్లూరు,కృష్ణా, నల్గొండ, కడప మరియు తెలంగాణ రాష్ట్ర పరిధిలోని హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్, ఇంటి దొంగతనాలు,బైక్ దొంగతనాలు చేసిమొత్తం94చోరీ కేసుల్లో నిందితుడు అయిన శివకుమార్ ను అదుపులోకి తీసుకుని విచారించగా225 గ్రాముల బంగారంసుమారు11లక్షల రూపాయలు విలువ వుండే బంగారం, ఒక ద్విచక్ర వాహనం,, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.పట్టాభిపురం పోలీసులు ఈ కేసులో చేసిన కృషిని అభినందించారు.

* అంతరాష్ట్ర ఆలయ హుండీ దొంగల ముఠా అరెస్టు….. కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు.➡️ కేసు దర్యాప్తు చేధనలో పాల్గొన్న పోలీసు అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన … రాష్ట్ర డిజిపి శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపియస్ గారు, జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు.➡️ ముగ్గురు నిందితులు అరెస్టు .➡️ స్పెషల్ టీం లు ఏర్పాటు చేసి దొంగతనాల కేసులను ఛాలెంజింగ్ చేధించాం.➡️ హైవే ప్రక్కన ఉన్న ఆలయాలలో దొంగతనాలే లక్ష్యంగా (టార్గెట్) నిందితుల లక్ష్యం.➡️ ఎవరికి అనుమానం రాకుండా ఫ్యామిలితో కలిసి నేరాలకు పాల్పడుతున్న నిందితుడు.➡️ 23 కేసులలో ముద్దాయిలు. (ఆలయాలలోనే 20 దొంగతనాలు).➡️ కర్నూలు జిల్లా 6, కడప జిల్లా 4 , అనంతపురం జిల్లా 11, ప్రకాశం జిల్లా 2 దొంగతనాల కేసుల్లో నిందితులు.➡️ శిరివెళ్ల ఫ్శ్ ఛ్ర్.ణొ’స్: 236/2020 మరియు 237/2020 కేసులలో దర్యాప్తును సాంకేతిక పరిజ్ఞానముతో ఛేదించిన పోలీసులు.➡️ నిందితులు కర్నూల్, కడప, అనంతపుర్, ప్రకాశం జిల్లాలలోని పలు కేసులలో ముద్దాయిలు.➡️ 12 లక్షల 30 వేల 780 రూపాయల విలువ గల బంగారం, వెండి ఆభరణాలు, 1 టూ వీలర్, 2 మొబైల్ ఫోన్ లు స్వాధీనం.