Devotional

అయ్యప్ప కోసం 246 మంది మాత్రమే రిజిస్ట్రేషన్

అయ్యప్ప కోసం 246 మంది మాత్రమే రిజిస్ట్రేషన్

ప్రఖ్యాత శబరిమల క్షేత్రంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ఆలయం తెరచిన ప్రతిసారీ వేలాదిగా భక్తులు అయ్యప్పను దర్శించుకునే వారు. కానీ, తాజాగా కేవలం 246 మంది మాత్రమే ఆన్‌లైన్‌ పోర్టల్‌లోని వర్చువల్‌ క్యూలో తమ పేర్లను నమోదు చేసుకోవడం గమనార్హం. పటిష్ఠ కొవిడ్‌ నిబంధనల నడుమ 7 నెలల తర్వాత తొలిసారిగా శబరిమల ఆలయం శుక్రవారం తెరచుకుంది. ఇవాళ్టి నుంచి సాధారణ భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే రోజుకు కేవలం 250 మందికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంతకుముందు కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓ ప్రకటన విడుదల చేస్తూ వారం ప్రారంభంలో 1000 మంది, వారాంతాల్లో 2000 మంది భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఈ మేరకు వర్చువల్‌ క్యూలో వివరాలు నమోదు చేసుకోవాలని కోరిన విషయం తెలిసిందే.