NRI-NRT

వలస పోయేందుకు కెనడా ఇటలీ జర్మనీలపై భారతీయుల ప్రేమ

వలస పోయేందుకు కెనడా ఇటలీ జర్మనీలపై భారతీయుల ప్రేమ

ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ) కూటమిలోని సభ్య దేశాలకు భారత్‌ నుంచి వలసలు భారీగా పెరిగినట్లు ‘ఇంటర్నేషనల్‌ మైగ్రేషన్‌ ఔట్‌లుక్‌ 2020’ వెల్లడించింది. ఓఈసీడీకి వలస వెళ్తున్న జాబితాలో చైనా ముందుండగా.. భారత్‌ రెండో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఆయా దేశాల పౌరసత్వం తీసుకోవడంలోనూ భారతీయుల సంఖ్య గణనీయంగానే ఉన్నట్లు పేర్కొంది. 2018లో భారత్‌ నుంచి ఓఈసీడీకి వలసలు 10 శాతం పెరిగి 3.3 లక్షలకు చేరినట్లు నివేదిక వెల్లడించింది. ప్రపంచ దేశాల నుంచి ఓఈసీడీకి వస్తున్న వలసల్లో ఇది ఐదు శాతమని పేర్కొంది. కెనడాకు అత్యధిక మంది వలసవెళ్తున్నట్లు గుర్తించింది. ఇటలీ, జర్మనీ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మొత్తం 2018లో 66 లక్షల మంది ఈ కూటమి దేశాలకు వలస వెళ్లారు. ఇది క్రితం సంవత్సరంతో పోలిస్తే 3.8శాతం ఎక్కువ.