DailyDose

బాలుడిని గొంతు నులిమి చంపేశారు-నేరవార్తలు

బాలుడిని గొంతు నులిమి చంపేశారు-నేరవార్తలు

* మహబూబాబాద్ జిల్లాలో కలకలం రేపిన కుసుమ దీక్షిత్‌రెడ్డి(9) కిడ్నాప్‌, హత్యకేసును పోలీసులు ఛేదించారు. కేసముద్రం మండలం అన్నారం శివారులోని గుట్టపై బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘‘ఆదివారం సాయంత్రం 6గంటలకు ద్విచక్రవాహనంపై వచ్చిన మంద సాగర్‌ అనే వ్యక్తి దీక్షిత్‌రెడ్డిని కిడ్నాప్‌ చేశాడు. కిడ్నాప్‌ చేసేందుకు ముందుగానే రెక్కీ నిర్వహించి సీసీ కెమెరాల్లో ఎక్కడా దొరక్కుండా జాగ్రత్త పడ్డాడు. అయినా… మహబూబాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద ఉన్న సీసీ కెమెరాలో మందసాగర్‌ ద్విచక్రవాహనంపై దీక్షిత్‌ను తీసుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. మెకానిక్‌గా పనిచేసే మందసాగర్‌ దీక్షిత్‌రెడ్డి ఇంటికి సమీపంలోనే ఉంటాడు. కిడ్నాప్‌ చేసిన తర్వాత డబ్బు డిమాండ్‌ చేశాడు. డబ్బుల కోసమే కిడ్నాప్‌ చేసినా.. ఆ తర్వాత దొరికి పోతామనే భయంతో బాలుడి గొంతు నులిమి చంపేశాడు. కిడ్నాప్‌ చేసిన గంటన్నరకే గొంతు నులిమి హతమార్చాడు. ఆ తర్వాత అన్నారం శివారులోని గుట్టపైకి మృత దేహాన్ని తీసుకెళ్లారు. చంపిన విషయం దాచిపెట్టి బాలుడిని విడిచిపెట్టేందుకు రూ.45లక్షలు డిమాండ్‌ చేశాడు. చంపిన తర్వాత కూడా రెండ్రోజుల పాటు ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిందితులను పట్టుకున్నాం. మందసాగర్‌తో పాటు మనోజ్‌రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నాం. అతని పాత్రపై కూడా విచారణ జరుపుతున్నాం. నిందితులు ఇంటర్నెట్‌ కాల్స్‌ చేసినా హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ టాస్క్‌ఫోర్స్‌ సాయంతో ఛేదించాం. నిందితుడి ఎన్‌కౌంటర్‌ జరగలేదు.’’ దర్యాప్తు అనంతరం ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

* సత్తెనపల్లి కోర్టులో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ చీటింగ్.7 లక్షల వరకు వసూలు చేసిన వైనం.నరసరావుపేటకు చెందిన న్యాయవాది, ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి సూత్రధారులు.నిర్మలా నగర్ కు చెందిన షేక్ ఇలియాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.

* తితిదే పిటిషన్ విచారణ వాయిదాతితిదే దాఖలు చేసిన పరువునష్టం దావా ఉపసంహరణ పిటిషన్​పై విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేసినట్లు సీనియర్ న్యాయవాది ఆదినారాయణ తెలిపారు.తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ. రమణ దీక్షితులు ఎంపీ వీ.విజయసాయిరెడ్డిపై తితిదే 2018లో పరువు నష్టం దావా దాఖలుచేసింది.ప్రస్తుతం ఆ దావా తిరుపతి పదో అదనపు జిల్లా సెషన్సు కోర్టులో విచారణలో ఉంది.ఈ నెల 14న ఈ దావాలో తెలంగాణకు చెందిన హిందూ జనసేన శక్తి వెల్ఫేర్ అసోసియేషన్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది.గత నెల 14న తితిదే దావా ఉపసంహరణకు పిటిషన్ దాఖలు చేసిన విషయం బయటపడింది.ఇంప్లీడ్ పిటిషన్​లో తితిదే, ఎ.వి రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డి తరఫున కౌంటర్లు దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

* పది ఎర్రచందనం దుంగలతో పాటు, ఇద్దరు స్మగ్లర్లు అరెస్టురంగంపేట సమీపంలోని శేషాచలం అడవుల్లో అక్రమ రవాణా చేస్తున్న పది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు స్మగ్లర్లు ను టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు ఆదేశాలు మేరకు డీఎస్పీ వెంకటయ్య ఆధ్వర్యంలో ఆర్ ఎస్ ఐ లింగాధర్, డీఆర్వో పివి. నరసింహ రావు టీమ్ బుధవారం సాయంత్రం నుంచి అలిపిరి-రంగంపేట మార్గంలో కూంబింగ్ చేపట్టారు.గురువారం ఉదయం నాగపట్ల ఈస్ట్ బీట్ చామల రేంజ్ లోని విద్యానికేతన్ ఎదురుగా రెండు కిలోమీటర్ల దూరం లోని అటవీ ప్రాంతంలో దాదాపు 11 మంది ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు.వారిపై దాడి చేయగా ఇద్దరు పట్టుబడ్డారు. మిగిలిన వారు దుంగలను వదిలి పారిపోయారు.పట్టుబడిన వారిని వెల్లి ఇళయరాజ్ (25), పలని రాజ్ (40) లుగా గుర్తించారు.

* చిత్తూరు జిల్లా చిన్నగొట్టిఘల్లుమండలంలోని బోరెడ్డి గారిపల్లిలో దారుణంపెళ్లైన ఆరు నెలలకే వివాహిత అనుమానాస్పద మృతి.మృతురాలు హరిత(23సం) మూడు నెలల గర్భిణీ.భర్త ఆనంద్ రెడ్డి(27) బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి.లాక్ డౌన్ కారణంగా ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్న భర్త ఆనంద్ రెడ్డి.అరగొండ అపోలో ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తూ రిజైన్ చేసిన హరిత.భార్యభర్తల ఇద్దరి స్వగ్రామం బోడిరెడ్డిగారి పల్లె.భార్యపై అనుమానంతో తరచూ గొడవలు.నిన్న రాత్రి అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకున్న హరిత.హరిత మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు.సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్న భాకరాపేట పోలీసులు.

* # జగద్గీరీ గుట్ట పీఎస్ పాపిరెడ్డి నగర్ విషాదం….# కృష్ణ ప్రియ వివాహిత ఆత్మహత్య…# ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోయిందని అంటున్న కృష్ణ ప్రియ భర్త, అత్త,మామ…# అత్తింటి వారే చంపేసారని ఆరోపిస్తున్న కృష్ణ ప్రియ తల్లిదండ్రులు….# పెళ్లిలో ఐదు లక్షల కట్నం తీసుకుని,మరో 12 లక్షల కట్నం డిమాండ్ చేసిన కృష్ణ ప్రియ భర్త శ్రవణ్ కుమార్…# ఐదు కాసులు బంగారం బంగారం పెడితేనే శ్రీమంతానికి అమ్మ వాళ్ళు ఇంటికి పంపుతాము అని చెప్పున అత్తింటివారు..# ఐదు నెలల ప్రెగ్నెంట్ తో ఉన్న కృష్ణ ప్రియ.