Sports

బ్రావో ఇక ఆడలేడు

బ్రావో ఇక ఆడలేడు

వరుస ఓటములతో విలవిల్లాడుతున్న చెన్నైకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు ప్రధాన ఆల్‌రౌండర్‌ డ్వేన్‌బ్రావో టోర్నీకి పూర్తిగా దూరమవుతున్నాడు. మిగిలిన ఐదు మ్యాచుల్లో అతడు ఆడడని ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్‌ ప్రకటించారు.

యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 లీగులో ధోనీసేన పేలవ ప్రదర్శన చేస్తోంది. 10 మ్యాచులాడి కేవలం మూడింట్లోనే విజయం సాధించింది. 6 పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. చెన్నై జట్టు గతంలో ఎప్పుడూ ఇంత దుస్థితిలో కనిపించలేదు. జట్టులోని కీలక ఆటగాళ్లంతా గాయాల బారిన పడ్డారు. అక్టోబర్‌ 17న దిల్లీతో జరిగిన మ్యాచులో గాయం కారణంగా బ్రావో ఆఖరి ఓవర్ ‌వేయని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘తొడ కండరాల గాయంతో డ్వేన్‌ బ్రావో మిగిలిన సీజన్‌కు పూర్తిగా దూరం అవుతున్నాడు’ అని ఫ్రాంచైజీ సీఈవో విశ్వనాథన్ తెలిపారు.