WorldWonders

హైదరాబాద్‌ను వణికిస్తున్న భూకంపాలు

హైదరాబాద్‌ను వణికిస్తున్న భూకంపాలు

హైదరాబాద్‌లో మళ్లీ కంపించిన భూమి.. ఈసారి వనస్థలిపురంలో..నగర వాసులను భయపెడుతున్న భూ ప్రకంపనలు.ఈ తెల్లవారుజామున పలుమార్లు కంపించిన భూమి.భూమిలోంచి శబ్దాలు రావడంతో భయంతో ప్రజల పరుగులు.హైదరాబాద్‌లో మళ్లీ భూప్రకంపనలు బెంబేలెత్తించాయి. బీఎన్‌రెడ్డి నగర్‌, వైదేహీనగర్‌ కాలనీలో వరుస భూప్రకంపనలు వచ్చాయి. తెల్లవారుజామున 5.40 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది.ఉదయం 6.45 గం.కు వైదేహీనగర్ కాలనీలో మరోసారి పెద్దశబ్దంతో భూమి కంపించింది. ఉదయం 7.08 గంటలకు మూడోసారి భూప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు వెల్లడించారు. మూడుసార్లు ప్రకంపనలు రావడం వల్ల ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు.