NRI-NRT

ఆస్ట్రేలియాలో ATAI బతుకమ్మ

Australia Telangana Telugu NRI NRT News - ATAI Batukamma 2020

ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి ఈసారి covid నిబంధనల కారణంగా ఆన్లైన్లో ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది ఎంగిలిపూల బతుకమ్మ సెలబ్రేషన్స్ తో ప్రారంభమై తొమ్మిది రోజులు ఘనంగా జరిపారు మొదటిరోజు ఉత్సవాలకి  ప్రపంచంలో ఉన్న తెలంగాణ సంఘాలు హాజరై శుభాకాంక్షలు తెలిపాయి అలాగే సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ ఉత్సవంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు పాల్గొన్నారు మరియు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు పాల్గొన్నారు కవిత గారు మాట్లాడుతూ ATAI  ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారని  ఈ సంవత్సరం కోవిడ్ కారణంగా ఉత్సవాలు ఆన్లైన్లో జరుపుకోవడం  జరిగాయి తెలంగాణ సాంప్రదాయాలని కాపాడుతూ ఆస్ట్రేలియాలో ఇంత ఘనంగా ఉత్సవాలు  జరిపినందుకు కార్యవర్గాన్ని అభినందించారు అలాగే మంత్రి గారు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆస్ట్రేలియా తెలంగాణ సంఘం అటు తెలంగాణలోనూ ఇటు Australia lo వారు చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు ముఖ్యంగా కోవిడ్ కారణంగా అందరూ ఇంటి వద్దనే ఉండి పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు ATAI  ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమంలో పాల్గొని వచ్చిన కవిత గారికి అలాగే మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి అధ్యక్షుడు అనిల్ బైరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు అలాగే కార్యవర్గ సభ్యులు  కిరణ్ పాల్వాయి, ఫణీ, వంశీ ,మహేష్  మరియు ఇతర కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఈ కార్యక్రమంలో ఆ ఇండియా నుండి ప్రముఖ గాయని తేలు విజయ గారు లైవ్ లో పాటలు పాడి అందర్నీ ఆహ్లాద పరిచారు  ప్రతి సంవత్సరం దాదాపు 5 నుంచి 6 వేల మంది పాల్గొన్న ఈ కార్యక్రమం ఈసారి covid  వల్ల ఆన్లైన్లో జరుపుకోవడం జరిగిందని  అధ్యక్షుడు అని బైరెడ్డి తెలిపారు.
ఆస్ట్రేలియాలో ATAI బతుకమ్మ