DailyDose

పురుగుమందు పోసి మహిళపై అత్యాచారం-నేరవార్తలు

పురుగుమందు పోసి మహిళపై అత్యాచారం-నేరవార్తలు

* కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 15 ఏళ్ళ బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా ఆమెను ఛమెందుకు బలవంతంగా నోట్లో పురుగుల మందు పోశారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. దేవనకొండ మండలం ప్యాలకుర్తి గ్రామంలో ఈ దారుణం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. స్కూల్ సెలవులు కావడంతో బాలిక ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో పొలం పనుల కోసం తల్లిదండ్రులు  పోయారు. ఒంటరిగా ఉన్న ఆమెను గర్హించిన ముగ్గురు యువకులు ఇంట్లోకి చొరబడి లైంగిక దాడి చేశారు. పక్కింటి బాలుడు ఈ దారుణాన్ని చూసి కేకలు వేయడంతో పరారయ్యారు. అంతకు ముందే ఆమెను బలవంతంగా గడ్డి మందు తాగించారు. ఈ ఘటనపై పలుగురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు. 

* బందరు గుడివాడ అవనిగడ్డ సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం.జిల్లా ఎస్పీ, ఏఎస్పీ లతోపాటు సబ్ డివిజన్ డీఎస్పీలు, సిఐలు, ఎస్సైలు హాజరు.*కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో, అధికారులు సిబ్బంది తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ, వ్యక్తిగత సంరక్షణ చర్యలు పాటిస్తూ వైరస్ను జయిస్తు, సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని,ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ఉన్న కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్పీ శ్రీ ఎం రవీంద్ర నాథ్ ఐపీఎస్ గారు బందరు ,గుడివాడ ,అవనిగడ్డ సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో నిర్వహించిన నేర సమీక్ష సమావేశం లో అన్నారు.

* ఒక మహిళ ట్రాఫిక్‌ పోలీస్‌ చెంప చెళ్లుమనిపించింది. మహారాష్ట్రలోని ముంబైలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.మోషిన్‌ షేక్‌ (32), సాంగ్రికా తివారీ (29) కలిసి బైక్‌పై వెళ్తున్నారు.కల్బదేవి ప్రాంతంలోని సుర్తి హోటల్ సమీపంలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌  ఏక్‌నాథ్‌ పార్టే వారి బైక్‌ను ఆపారు. హెల్మెట్ ధరించకపోవడంపై జరిమానా విధించారు.మరోవైపు ట్రాఫిక్‌ కానిస్టేబుల్ ఏక్‌నాథ్‌ తనను తిడుతున్నారంటూ సాంగ్రికా తివారీ యూనిఫాంలో ఉన్న ఆయనను పట్టుకుని పలుమార్లు చెంప చెళ్లుమనిపించారు.కాగా ఆమె స్నేహితుడు మోషిన్‌ షేక్‌ తన మొబైల్‌లో దీనిని వీడియో తీశాడు.ఇంతలో మిగతా పోలీసులు జోక్యం చేసుకుని  ఏక్‌నాథ్‌ను కాపాడారు.విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై చేయి చేసుకోవడం, విధులకు ఆటకం కల్పించారన్న ఆరోపణలతో వారిద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.మరోవైపు ఈ వీడియో సామాజిక మాథ్యమాల్లో వైరల్‌ అయ్యింది. 

* భవనం పైనుంచి దూకి కరోనా పేషెంట్ ఆత్మహత్యపశ్చిమగోదావరి:  జిల్లాలోని ఏలూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది.కరోనా పేషెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆశ్రం ఆస్పత్రి భవనం పైనుంచి దూకాడు.మృతుడు వంగాయిగూడెంకు చెందిన లంకపల్లి రంగారావు (45)గా గుర్తించారు.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి  చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.కరోనా పేషెంట్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.

* అలబామాలో అమెరికా నౌకాదళానికి చెందిన రెండు సీటర్ల విమానం కుప్పకూలగా, అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు నేవీ సిబ్బంది దుర్మరణం పాలయ్యారు.