DailyDose

విజయవాడలో భారీగా విదేశీ నోట్లు పట్టివేత-నేరవార్తలు

విజయవాడలో భారీగా విదేశీ నోట్లు పట్టివేత-నేరవార్తలు

* టర్కీలో ఇటీవల రద్దు చేసిన నోట్లను భారీ మొత్తంలో విక్రయించేందుకు ప్రయత్నించిన ఐదుగురు సభ్యుల ముఠాను విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు.వారి నుంచి దాదాపు రూ.15 కోట్ల విలువైన టర్కీ దేశ కరెన్సీ ని పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మొత్తాన్ని రూ. 45 లక్షలకు విక్రయించేందుకు మరో ముఠా తో ఒప్పందం కుదుర్చుకున్నారు.నిందితులు నగరం లోని అజిత్ సింగ్ నగర్ లోని ఆంధ్రపభ కాలనీ లో ఉన్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఐదుగురిని పట్టుకున్నారు.పట్టుబడిన వారిని కడప కు చెందిన జి. మనోహర్, పశ్చిమ గోదావరికి చెందిన పి. వెంకటేశ్వర్ రావు, శ్రీనివాస్ రావు, చిత్తూరుకు చెందిన సుకుమార్ , కర్నూలుకు చెందిన జి. రవి కుమార్ లుగా పోలీసులు గుర్తించారు.వారి వద్ద నుంచి రూ. 15 కోట్ల విదేశీ కరెన్సీ, ఇన్నోవా కారు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులకు విదేశీ కరెన్సీ ఎలా వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నారు.

* గుంటూరు జిల్లా A.P.DA SCAC కార్యాలయంలో ఎసిబి అధికారుల దాడులు..లంచం తీసుకుంటూ ఎసిబి కి చిక్కిన గుంటూరు జిల్లా విభిన్న ప్రతిభవంతుల కార్పొరేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ జి వెంకటరమణ..గుంటూరు జిల్లా విభిన్న ప్రతిభ వంతుల కార్పొరేషన్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న జి.వెంకటరమణ బాధితుడి నుండి 5000 లంచం తీసుకుంటూ ఎసిబి కి చిక్కారు.వెంకటరమణ పై ఎసిబి అధికారులు కేసు నమోదు చేశారు..ఈ దాడిలో లో ఎసిబి డిఎస్పీలు ప్రతాప్, హర్ష, సిఐ లురవిబాబు, శ్రీధర్, నాగరాజు, ఎస్.ఐ. మూర్తి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

* విశాఖ మారికవలస రాజీవ్ గృహాకల్ప కోలని లో కుమారుడు(అనిల్)ని హాతమార్చిన తల్లి మాధవి.

* దివ్య హత్యకేసులో ఇవాళ నిందితుడిని అరెస్ట్ చేసే అవకాశందివ్య హత్య కేసులో నిందితుడు నాగేంద్ర ఇవాళ జీజీహెచ్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కాబోతున్నాడు.దీంతో నాగేంద్ర డిశ్చార్జ్ కాగానే పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. అనంతరం కోర్టులో ఛార్జ్‌షీట్‌ దా‍ఖలు చేస్తారు.ఈ కేసులో ఇప్పటివరకు 45 మందిని విచారించగా‎ ఫోరెన్సిక్, పోస్టుమార్టం రిపోర్టులు మాత్రం దివ్యది సూసైడ్ కాదని చెబుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విజయవాడ ఇంజినీరింగ్‌ విద్యార్థిని దివ్య హత్య కేసులో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

* బొగ్గు బ్లాక్​ను కేటాయించడంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన కుంభకోణం కేసులో దోషిగా తేలిన కేంద్ర మాజీ మంత్రి దిలీప్​ రేకు శిక్ష ఖరారు చేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.

* టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది.పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న లోకేష్.. ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద ట్రాక్టర్ నడిపారు.

* ములుగు జిల్లాకు ఆదివారం భయం పట్టుకుంది. అక్టోబర్ నెలలో ప్రతీ ఆదివారం జిల్లాలో ఏదో ఒక పెద్ద ఘటన జరుగుతూనే ఉంది. ఆదివారం వస్తుంది అంటే చాలు జిల్లా వాసులు వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ దుర్వార్థ వినాల్సి వస్తుందోనని హడలిపోతున్నారు. అసలు ఆదివారానికి ములుగు జిల్లాకు ఉన్న లింక్ ఏంటి?జనం ఎందుకు ఇంతలా భయపడిపోతున్నారు? తెలంగాణలో పోలీసులు మావోయిస్టుల మధ్య ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. అక్టోబరు నెలలో ఆదివారం రోజునే వరుస ఎన్‌కౌంటర్లు జరగటం కలకలం రేపుతోంది. అక్టోబర్ నెలలో నాలుగు ఆదివారాల్లో నాలుగు పెద్ద ఘటనలు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల కట్టడికి మొదట పోలీసులు అక్టోబర్ 4న ములుగు జిల్లా వాజేడు వెంకటపూర్‌లో కేంద్ర పోలీసు అధికారులతో పాటు.. నాలుగు రాష్ట్రాల పోలీసు అధికారులు మీటింగ్ జరిగింది.

* తెలంగాణ రాష్ట్రంలోని మెట్ పల్లి పట్టణంలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. 14 ఏళ్ల మైనర్ బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అత్యాచారం చేస్తుండగా వీడియో తీసిన సదరు నిందితులు.. సదరు వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఐదుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.

* అక్రమ దందా చేస్తూ చీరాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు నవ్య కేబుల్ విలేఖరి పై వాసు(చిన్న).ఇతను TV9 విలేఖరిని అని చెప్పుకుని మసీదు సెంటర్లో ఒక పాన్ దుకాణం వ్యాపారిని బెదిరించి ముప్పై వేల రూపాయలను తీసుకోవడంతో వ్యాపారి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అతనిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిన ఎస్.ఐ.